ఫిట్‌నెస్ కోసం ఇష్టమైన వాటిని దూరం పెట్టిన ధోని..

honi said about his fitness secrets
Share Icons:

ముంబై, 13 జూన్:

క్రికెట్‌లో ఆటగాళ్లకు ఫిట్‌నెస్ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఎంతటి పేరున్న ఆటగాడైనా సరే ఫిట్‌నెస్‌ సాధిస్తేనే జట్టులో ఉంటాడు.

ఇక ఇలాంటి విషయంలో ఎప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటాడు భారత్ మాజీ కెప్టెన్ ధోని…. 36 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఫిట్‌గా ఉంటూ, జట్టులోని యువ ఆటగాళ్లతో పరుగులు తీసేందుకు పోటీపడతాడు.

పదేళ్ల నుంచి క్రికెట్‌ మైదానంలో వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడంలో ధోనీకి ఎవరు సాటిరారనే చెప్పాలి.

ఈ విషయం చాలాసార్లు రుజువైంది కూడా. అయితే, ఫిట్‌గా ఉండటం కోసం ధోనీ ఎన్ని త్యాగాలు చేశాడంటా. తనకు ఎంతో ఇష్టమైన చికెన్, చాక్లెట్స్, మిల్క్ షేక్స్‌ని కూడా దూరంగా పెట్టడంటా…

ఇటీవల ముంబైలో జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్ లో మట్లాడుతూ ధోనీ ఈ విషయాన్ని వెల్లడించాడు. మెరుగైన ఫలితాలను సాధించాలంటే, తన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టినప్పుడు అనుకున్నానని ధోనీ చెప్పాడు.

బటర్‌ చికెన్‌, నాన్‌, మిల్క్‌ షేక్స్‌, చాక్లెట్లు, సాఫ్ట్‌ డ్రింక్స్‌ ఎక్కువగా తీసుకునేవాడినని, అయితే 28వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన అప్పటి నుంచి చాక్లెట్లు, మిల్క్‌షేక్స్‌ తీసుకోవడం మానేశానని చెప్పాడు.

ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు సాఫ్ట్‌ డ్రింక్స్‌ కూడా వదిలేశానని, ఇక టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన అప్పటి నుంచి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టానని, ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలతో పాటు చికెన్ కబాబ్స్‌ తీసుకుంటున్నానని ధోనీ తెలిపాడు.

మామాట: కొన్ని కావాలనుకుంటే…కొన్ని వదులుకోవాల్సిందే…!

Leave a Reply