నేను ఎప్పుడు రిటైర్ అవుతానో నాకే తెలియదు: ధోనీ

dhoni responds over his retirement
Share Icons:

లండన్:

 

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ తర్వాత భారత్ మాజీ కెప్టెన్ ఎం‌ఎస్ ధోని క్రికెట్ కి రిటైర్మెంట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పలువురు కీలక ఆటగాళ్లు వరల్డ్ కప్ పోటీలే తమకు చివరి పోటీలని ఇప్పటికే రిటైర్ మెంట్ ప్రకటించారు. భారత మిడిలార్డర్‌ ఆటగాడు అంబటి రాయుడు, పాక్‌ సీనియర్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌, దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌, వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ తదితరులు ఆటకు విరమణ ప్రకటించేశారు.

 

ఇదే టోర్నీలో తన నిదానపు ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న ధోనీ సైతం వీడ్కోలు పలకనున్నాడని వార్తలు రాగా, ధోనీ వాటిని ఖండించాడు. వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ అనంతరం, రిటైర్ మెంట్ చెబుతానని వస్తున్న వార్తలు గాలి వార్తలేనని స్పష్టం చేశాడు.

 

ఏబీపీ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో,  తానెప్పుడు రిటైర్‌ అవుతానో చెప్పలేనని, కానీ చాలా మంది తాను శ్రీలంకతో మ్యాచ్ కి ముందే రిటైర్ మెంట్ ప్రకటించాలని కోరుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా, వరల్డ్ కప్ తరువాత కూడా ధోనీ జట్టులో ఉంటాడని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

 

ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఆల్ రౌండర్ షోయ‌బ్ మాలిక్ తాను అంతర్జాతీయ వన్డేల నుంచి తప్పుకుంటున్న‌ట్టు తాజాగా ప్ర‌క‌టించాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా షోయ‌బ్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌గా, నెటిజ‌న్స్ షాక్ అవుతున్నారు. 1999లో తొలి వన్డే ఆడిన మాలిక్‌ 20 ఏళ్ల కెరీర్‌లో 287 వన్డేల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 34.55 సగటుతో 7,534 పరుగులు చేశాడు. 39.19 సగటుతో 158 వికెట్లు పడగొట్టాడు . వ‌న్డేల‌లో షోయ‌బ్ మాలిక్ 9 సెంచ‌రీలు, 44 అర్ద సెంచ‌రీలు చేశారు.

 

Leave a Reply