ఇండియన్‌ టెరైన్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ధోనీ

Dhoni - Brand Ambassador -Indian Terrain Company
Share Icons:

చెన్నై, మే21,

భారత క్రికెటర్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ, ఇండియన్‌ టెరైన్‌ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సోమవారం మధ్యాహ్నం చెన్నైలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకీ రాజగోపాల్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

పదేళ్లకు ముందు తాంబరంలో ప్రారంభించిన ఇండియన్‌ టెరైన్‌ సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150 స్టోర్లలో తమ ఉత్పత్తులు విక్రయించే స్థాయికి ఎదిగిందని తెలిపారు. సంస్థ టర్నోవర్‌ను మూడేళ్లలో రూ. 650 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, భవిష్యత్‌లో మరో 150 స్టోర్లలో తమ ఉత్పత్తులను విక్రయించనున్నామని వివరించారు. ఈ సమావేశంలో సంస్థ ఎండీ శరత్‌నరసింహన్‌ కూడా పాల్గొన్నారు.

మామాట- ఆటలు ఆడడం వలన ఎంత డబ్బో.. అబ్బో

Leave a Reply