గాయంతో ప్రపంచ కప్ నుంచి ధావన్ అవుట్…

Share Icons:

లండన్, 11 జూన్:

బొటనవేలు గాయం కారణంగా భారత్ ఓపెనర్  శిఖర్ ధావన్ మూడు వారాల పాటు ప్రపంచకప్ టోర్నమెంటు నుంచి వైదొలగనున్నాడు. గత ఆదివారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ ఎడమ చేతి బొటనవేలుకు బంతి బలంగా తగిలింది. చేతికి గాయమైనప్పటికీ పట్టు వదలకుండా.. బ్యాటింగ్ చేసిన ధవన్.. ఆస్ట్రేలియాపై 117 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అయితే సోమవారం స్కానింగ్ చేయడంతో వేలు ఎముక చిట్లినట్టు తేలింది. ఈ గాయం కారణంగా వచ్చే మూడు వారాల్లో వరల్డ్ కప్‌లో జరిగే మ్యాచ్‌లలో శిఖర్ ధవన్ ఆడే అవకాశం లేదు. శిఖర్ ధవన్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ లేదా రిషబ్ పంత్‌లు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply