డ్రగ్స్ వ్యవహారం కథనాలపై చంద్రబాబు, లోకేశ్ కు ఏపీ డీజీపీ లీగల్ నోటీసులు…

Share Icons:
  • కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి, ఈనాడుకు కూడా…

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున పట్టుబడిన హెరాయిన్‌కు ఏపీతో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, బోండా ఉమ, బుద్ధా వెంకన్న, కొమ్మారెడ్డి పట్టాభితోపాటు ఈ వ్యవహారంపై కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు, రామోజీరావు, ఆయన కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, ఉషోదయ పబ్లికేషన్స్, ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ఈనాడు బ్యూరో చీఫ్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, అమోద పబ్లికేషన్స్, ప్రింటర్, పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావు, ఆ పత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్, బ్యూరో చీఫ్‌లకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ లీగల్ నోటీసులు పంపారు.

 

గుజరాత్‌లో పట్టుబడిన హెరాయిన్‌తో ఏపీకి సంబంధం లేదని విజయవాడ పోలీసు కమిషనర్ స్పష్టం చేసినప్పటికీ ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబార్చేలా, పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేశారని ఆ నోటీసుల్లో డీజీపీ పేర్కొన్నారు. పట్టుబడిన హెరాయిన్‌తో ఏపీకి సంబంధం లేదని డీఆర్ఐ స్వయంగా ప్రకటించిందని గుర్తు చేశారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

 

Leave a Reply