అక్షరాల అశృవులు

Share Icons:

దేవిప్రియ, నాలుగక్షరాలు. ఆయనలో సరస్వతీ ‘దేవి..ప్రియ’ మైనది అందరికీ. నాలుగక్షరాల  ఆ హాఫ్ బుష్ షర్ట్ టక్ చేసి, బెల్ట్ తో బిగిస్తాడు, మిత్రులను జారిపోకుండా… నిండుగా నవ్వుతాడు మిత్రుల మనసులను తెల్లమీసకట్టు కింద పెదాలతో మరీ బిగబట్టి. ఒకవిధంగా.. బట్టతల గిరజాల జుట్టును పైకిదువ్వి..  నాలుగక్షరాల మనిషి దేవిప్రియ నాకు నాలుగు దశాబ్దాల పాత్రికేయ ప్రియమిత్రుడు. గుంటూరు సీమ పండించిన కారం లేని కవి మిరపకాయ మమకారం ఎక్కువ. ఆయన ఆంధ్రప్రభ లో ఉన్నప్పుడు నేను విజయవాడ  ఈనాడులో…  ఎబికె వెన్నంటి ఉండే పెన్నుల తూణీరంలో దేవిప్రియ ఒక పదునైన ఆయుధం.  నేను కవిని కాను గనుక మామధ్య కవిత్వం చోటుచేసుకోదు.  మనసులు కలసిన మాటలే. ఒక కె ఎన్ వై పతంజలి, మరొక దేవిప్రియ.

దేవిప్రియ, నేను ప్రత్యక్షంగా ఉదయం, ఆంధ్రజ్యోతి లో కలసి కదలిన కలాలు. ఆంధ్రజ్యోతిలో ఆయన చాంబర్ లో కలసి కూర్చున్న గంటలెన్నో.. ఆ రోజుల్లో నన్ను, నాకిష్టమైన మిర్చి బజ్జీలను ఆస్వాదించే వాడు. ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నా, వందమంది మధ్యన ఉన్నా… ఆప్యాయంగా .. ఆ చిరుబొజ్జకు చేరదీసుకుని.. రాధా.. అని గుండెలకు హత్తుకునే వాడు.

కోవిడ్ ముందు తరచూ సాహితీ సమావేశాలు, బుక్ ఎగ్జిబిషన్ లో కలసేవాళ్ళo.  ఈ విషాద, ప్రమాదకర సమయంలో.. చివరి చూపులు కాడా నోచుకోలేకపోవడం  దురదృష్టం. మౌనంగా అక్షరాల అశృవులు రాల్చడం మినహా…

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply