జగన్‌కు రాజ్యాధికారం పగటి కలే…

devineni uma clarifies about jagan comments on ambulance
Share Icons:

విజయవాడ, 21 మే:

మహిళా ప్రభంజనంతో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఈరోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… 23న ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో తాము సంబరాలు చేసుకుంటామని చెప్పారు. ఈ ఎన్నికల్లో వెయ్యిశాతం గెలుపు సాధ్యమని చెప్పగలిగిన ఏకైక పార్టీ తమదేనని ఆయన అన్నారు.

అరాచకశక్తులు అధికారం కావాలని పాకులాడుతున్నాయని, ఈ విషయాన్ని ఏపీ ప్రజలు ముందే గ్రహించి టీడీపీ వైపు మొగ్గు చూపరాని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ చూసుకుని, తెలంగాణలో జగన్ సంబరపడిపోతున్నారని ఎద్దేవా చేశారు.

ఇక ఎన్నికలు ముగిసిన తరువాత 40 రోజుల పాటు అభ్యర్థులతో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేని జగన్‌కు.. రాజ్యాధికారం పగటి కలేనని విమర్శించారు. అటు బీహార్ ముఠాతో ఏపీలో దిగిన ప్రశాంత్ కిశోర్, జగన్, విజయసాయిరెడ్డిలు, ఓడిపోయిన తరువాత మీడియా ముందుకు వచ్చి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

అసలు ఏం చూసి ప్రజలు జగన్ కు ఓటు వేయాలని ప్రశ్నించారు. అమరావతిని భ్రమరావతి అన్న జగన్ కు ఎందుకు ఓటు వేస్తారని, రాష్ట్రం ఏమైపోతుందో అనే భయంతో ప్రజలు టీడీపీకే ఓటు వేశారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతుంటే, కేవీపీ రామచంద్రరావు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

మామాట: 23 తర్వాత ఎవరికి కలగా మిగులుతుందో చూడాలి

Leave a Reply