తోట రాకతో వైసీపీలో ముసలం: మంత్రి పిల్లి సంచలన వ్యాఖ్యలు…

deputy cm pilli subhash chandrabose sensational comments on thota trimurthulu
Share Icons:

కాకినాడ: ఇటీవల తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే తోట రాకతో వైసీపీలో ముసలం ఏర్పడింది. ఆ పార్టీలోని సీనియర్ నేత, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు తోటకు చాలా కాలం నుంచి పడదు. ఇద్దరు చిరకాల రాజకీయ శత్రువులు. రామచంద్రాపురం నుంచి అనేక సార్లు ఇద్దరు ప్రత్యర్ధులుగా తలపడ్డారు. అలాంటిది ఇప్పుడు తోట వైసీపీలో చేరడం పిల్లికి నచ్చడం లేదు. అధినేత జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉన్న…ఏదో మొక్కుబడిగానే తోట రాకని స్వాగతిస్తున్నారు.

ఈ క్రమంలోనే బుధవారం పిల్లి సుభాస్ తోటని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ‘వెంకటాయపాలెం శిరోముండనం’ కేసులో తోటను కఠినంగా శిక్షించాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ కాన్వాయ్‌ను దళిత సంఘం నేతలు అడ్డుకున్నారు. తోటను అరెస్ట్ చేసి తీరాల్సిందేనని దళిత సంఘాలు పట్టుబట్టాయి.

దీంతూ పిల్లి మాట్లాడుతూ.. ఎప్పటికైనా తోట తనకు శత్రువేనని అన్నారు. పార్టీలోకి ఎందరో వస్తుంటారు… పోతుంటారని, వెంకటాయపాలెం శిరోముండనం కేసులో.. వైసీపీ ప్రభుత్వం దళితుల పక్షాన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వైసీపీకి దళితులు అండగా ఉన్నారని, వారిని తాము వదులుకునే ప్రసక్తేలేదన్నారు. కేసులో ఏదైనా తేడా జరిగితే బాధితులను నేరుగా సీఎం దగ్గరికి తీసుకెళ్తానని, అవసరమైతే దళితులతో కలిసి ధర్నా చేసేందుకైనా తాను సిద్దమని పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ స్పష్టం చేశారు. ఇక పిల్లి చేసిన ఈ వ్యాఖ్యలు అధికార పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. పిల్లి వ్యాఖ్యలపై తోట ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

టీటీడీ కొత్త పాలకమండలి

వైసీపీ ప్రభుత్వం టీటీడీ పాలకమండలి సభ్యులను నియమించింది. చైర్మన్, 28 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలి కొలువుదీరింది. టీటీడీ బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యేలు మల్లికార్జునరెడ్డి, కె. పార్థసారథి, యువీ రమణమూర్తి నియమితులయ్యారు. వీరితోపాటు వి.ప్రశాంతి, పరిగెల మురళీకృష్ణ, కృష్ణమూర్తి వైద్యనాథన్, జూపల్లి రామేశ్వరావు, ఎన్.శ్రీనివాసన్, బి.పార్థసారథి రెడ్డి, డాక్టర్ నిశ్చిత ముప్పవరపు, డీపీ అనంత, నాదెండ్ల సుబ్బారావు, రమేశ్ శెట్టి, రాజేశ్ శర్మ, మోరంశెట్టి రాములు, జి.వెంకట భాస్కరరావు, డి.దామోదర్ రావు, చిప్పగిరి ప్రసాద్ కుమార్, ఎంఎస్ శివశంకరన్, సంపత్ రవినారాయణ, సుధా నారాయణ మూర్తి, కుమారగురు, పుత్తా ప్రతాపరెడ్డి, కె.శివకుమార్ కూడా నియమితులయ్యారు. నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులకు కూడా పాలకమండలిలో స్థానం దక్కింది.

Leave a Reply