సీఎం జగన్ ఇంటి వెనక శివశ్రీ ఇల్లు భద్రతా కారణాల రీత్యా కూల్చివేత

Share Icons:
  • రాత్రికి రాత్రి కూల్చివేసిన అధికారులు
  • ఆత్మహత్యకు యత్నించిన శివశ్రీ సోదరుడు!
  • జగన్ నివాసం వెనకున్న ఇళ్ల కూల్చివేత
  • తనకు ప్రాణహాని. ప్రభుత్వం తనపై కక్ష ఆవేదన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వెనక పేదల ఇళ్ల కూల్చివేతలపై పోరాడుతున్న శివశ్రీ ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఇంటిని కూల్చివేస్తున్నామని, గురువారం లోగా ఖాళీ చేసి వెళ్లాలని నోటీసులు అంటించిన అధికారులు గతరాత్రి కూల్చివేయడం గమనార్హం. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలవడం వల్లే తన ఇంటిని కూల్చివేశారని, అధికారులు తనపై కక్ష సాధిస్తున్నారని శివశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ శివశ్రీ వీడియో విడుదల చేశారు. ఇది రాజకీయం చేయడం తగదని వైసీపీ నేతలు అంటున్నారు.

భద్రతా కారణాల రీత్యా ముఖ్యమంత్రి నివాసం వెనక  కాలనీలోని 321 కుటుంబాలను ప్రభుత్వం ఖాళీ చేయిస్తోంది. ఇందులో భాగంగా 277 కుటుంబాలకు ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపులో న్యాయం జరగలేదని, నిరాశ్రయులకు మరింత పరిహారం ఇవ్వాలంటూ శివశ్రీ పోరాడుతున్నారు., శివశ్రీ ఇంటిని అధికారులు కూల్చివేయడంతో ఆమె తల్లి స్పృహతప్పి పడిపోయారు. మనస్తాపానికి గురైన ఆమె సోదరుడు ఆత్మహత్యకు యత్నించాడు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply