యాచకులకి ఉపాధి శిక్షణ..

Delhi cm arvind kejriwal introduce skill development course for beggars
Share Icons:

ఢిల్లీ, 4 జూన్:

ఎక్కడైనా యాచకులు కనిపిస్తే వారికి ఎంతోకొంత డబ్బుని దానం చేయడమో లేదా ఏదైనా వసతి గృహంలో చేర్పించడం చేస్తారు.

కానీ వీటిన్నంటికి విభిన్నంగా ఢిల్లీ ముఖ్యమంత్రి వీరికోసం సరికొత్త ప్రణాళికని రూపొందించారు.

దేశ రాజధానిలోని యాచకులకు ఉపాధి కల్పించి, వారి సంఖ్యను తగ్గించే దిశగా కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యాచకుల గృహంలో జీవిస్తున్న వారికోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఢిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ పథకం ద్వారా యాచకులకు చేతివృత్తులు, కుట్టు పనులు ఇతర పనులను నేర్పిస్తారు. అంతేకాకుండా వాటితో పాటు వారికి రోజుకు రూ.250 చొప్పున ఇవ్వనున్నారు.

ఇక ఈ కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన వారికి సంబంధిత కిట్స్‌ను అందజేసి ఉపాధి కల్పిస్తారు. ఇలా యాచకులందరికీ ఏదోరకంగా ఉపాధి కల్పించి.. వారిని యాచక వృత్తి నుంచి బయటకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వ వసతి గృహాల్లోని వారే కాకుండా బయట ఉంటున్న యాచకులు కూడా ఈ ప్రత్యేక కోర్సుని నేర్చోకోవచ్చని తెలిపింది. కాకపోతే వారు కూడా వసతి గృహాలకి రావాలని సూచించింది.

మామాట: ఇలా అన్నీ రాష్ట్రాల్లోనూ పెడితే బాగుంటుందేమో..!

Leave a Reply