ఢిల్లీ మళ్ళీ కేజ్రీదే: తేల్చేసిన టైమ్స్ నౌ సర్వే..

AAP leader dilip fires on bjp
Share Icons:

ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ పీఠం కోసం అధికార ఆప్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల మధ్య  హోరాహోరీ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే.  ఢిల్లీ ఎన్నికలు ఈ నెల 8న జరగనుండగా, 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కడతారని ‘టైమ్స్ నో’ పోల్ అంచనా వేసింది. ఢిల్లీ అసెంబ్లీలో 54 నుంచి 60 సీట్లను ఆప్ గెలుచుకుంటుందని లెక్కగట్టింది. బీజేపీ కేవలం 10 నుంచి 14 సీట్లకే పరిమితం అవుతోందని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందని తెలియజేసింది. ఢిల్లీలో 7 వేల 321 మంది నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలను తెలుసుకొని సర్వే రూపొందిచారు. జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు సర్వే నిర్వహించారు.

అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏడు సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. సంవత్సరంలో బీజేపీ ఓటుబ్యాంకు కూడా ఆప్‌కు మళ్లడం విశేషం. ఢిల్లీలో ఆప్ ఓటుబ్యాంకు 52 శాతం ఉండగా, బీజేపీ 34 శాతానికి పడిపోయింది. ఏడాదిలో బీజేపీ ఓటు శాతం 18 తగ్గింది. 2015 అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా.. తిరిగి ఓటుశాతం ఆప్‌కి చేరింది. గత ఎన్నికలతో ఆప్ 2.5 శాతం ఓటు శాతం తగ్గగా.. బీజేపీ స్వల్పం 1.7 శాతం పుంజుకొని ఫరవాలేదు అనిపించింది.

లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ ఓటు షేర్ బీజేపీకి 46 శాతం ఉండగా, ఆప్ 38 స్థానంలో ఉంది. కానీ ఏడాదిలోని ఆప్ తన ప్రభను తిరిగి సంపాదించుకోగలిగింది. అయితే ప్రధానమంత్రి పదవీకి మాత్రం నరేంద్ర మోడీ అర్హుడని పేర్కొనడం విశేషం. 75 శాతం ప్రజలు మోడీ ప్రధాని ఉండటాన్ని స్వాగతిస్తున్నారు. రెండో స్థానంలో ఉన్న రాహుల్ గాంధీ మాత్రం 8 శాతం దక్కించుకోవడం విశేషం

పౌరసత్వ సవరణ చట్టం నిర్ణయాన్ని 71 శాతం ప్రజలు అనుకూలంగా ఉన్నారు. 52 శాతం మంది మాత్రం షహీన్ బాగ్ ఆందోళనను వ్యతిరేకించారు. ఇందులో 25 శాతం మంది మాత్రం నిరసనలు సబబేనని అభిప్రాయపడ్డారు. మరో 24 శాతం మంది మాత్రం తమ అభిప్రాయాన్ని పంచుకోలేదు.

 

Leave a Reply