మోదీని సైడ్ చేసేసిన చీపురు…ఢిల్లీ సుల్తాన్ కేజ్రీనే…

Share Icons:

ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వరుసగా వెలువడుతున్నాయి. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ దూసుకెళుతుంది. మోదీకి చీపురు రూపంలో ఊహించని షాక్ ఎదురైంది.  70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంల ద్వారా శనివారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంలను మంగళవారం ఉదయం కౌంటింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చి.. ఆయా రాజకీయ పార్టీలు కేటాయించిన ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు.

ఇక మొత్తం 70 సీట్లలో ఆప్ 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే, బీజేపీ 18 స్థానాల్లో లీడింగ్ కొంసాగుతుంది. కాంగ్రెస్ సహ మిగిలిన పార్టీలు అడ్రెస్ లేకుండా పోయాయి. అటు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ విజయం దిశగా పయనిస్తున్నారు. ముస్తఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి హాజీ యూనుస్ ముందంజలో ఉన్నారు. మోడల్ టౌన్ నుంచి ఆప్ అభ్యర్థి అఖిలేష్ త్రిపాఠి ఆధిక్యంలో ఉన్నారు. ఆప్ అభ్యర్థులు అతిషీ, రాఘవ్ చాదాలు తమ సమీప ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. మాలవీయనగర్ నుంచి ఆప్ అభ్యర్థిని సోమనాథ్ భారతి బీజేపీ అభ్యర్థిపై ఆధిక్యంలో ఉన్నారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తన సమీప బీజేపీ అభ్యర్థి కంటే ముందంజలో ఉన్నారు.

ఎగ్జిట్ పోల్స్ మాత్రం అధికార ఆప్ పార్టీ విజయం సాధిస్తోందని అంచనా వేశాయి. ఆప్ 40 నుంచి 55 సీట్ల వరకు గెలుచుకుంటుందని లెక్కగట్టాయి. బీజేపీ 20 నుంచి 25 సీట్లు వరకు గెలుస్తాయని తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ మూడోస్థానానికి పరిమితమైంది. రెండు నుంచి మూడు సీట్లే గెలుచుకుంటుందని పేర్కొన్నది. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ హవా కనిపించింది. ఏడు లోక్‌సభ స్థానాలు గెలిచి సత్తా చాటింది. కానీ ఏడాదిలోపే పరిస్థితి మారిపోయినట్టు అనిపిస్తోంది. ఢిల్లీ ప్రజల గాలి మళ్లీ చీపురు పార్టీకే మళ్లినట్టు కనిపిస్తోంది.

 

Leave a Reply