బెంగలూరులోనే ఏరో ఇండియా ప్రదర్శన

Share Icons:

బెంగలూరు, సెప్టెంబర్ 08,

వచ్చే ఏడాది ఏరో ఇండియా ప్రదర్శన ఫిబ్రవరి 20-24 , 2019 తేదీల మధ్య బెంగులూరులో జరుగుతుందని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఐదు రోజులు జరిగే ఈ ప్రదర్శనలో ట్రేడ్ ఎక్జిబిషన్ సహా పబ్లిక్ ఎయిర్ షో ఉంటుంది. వివిధ దేశాలకు చెందిన ఏరోఇంజనీరింగ్ పరిశ్రమలు, వ్యాపారవేత్తలు, రభణ శాఖ నిపుణులు ఇందులో పాల్గొంటారు.

కాగా, ఈ ప్రదర్శనను బెంగలూరు నుంచి ఉత్తర ప్రదేశ్  రాష్ట్రానికి తరలిస్తారనే వార్తలు రావడంతో రాజకీయంగా విమర్శలు వెళ్లువెత్తాయి. లక్నో నగరం వద్ద ఏరో ప్రదర్శన నిర్వహించే మౌళిక వసతులు లేవనేది ప్రధానంగా విమర్శకులు పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు జరిగిన 11 ఏరో ఇంటియా ప్రదర్శనలు బెంగలూరులోని యెళహంక ఏయిర్ ఫోర్స్ కేంద్ర వేదికగా జరిగినవే కావడం గమనార్హం.

మామాట:  వైమానిక ప్రదర్శనలో కూడా రాజకీయాలా  స్వామీ

Leave a Reply