జగన్ హవాలో ఓడిన టీడీపీ వారసులు…

Share Icons:

అమరావతి, 24 మే:

ఏపీలో జగన్ హవాలో టీడీపీలో మంత్రులతో సహ తలపండిన సీనియర్ నేతలు ఓటమిని చవిచూశారు. ఇక వీరే కాకుండా కొందరు సీనియర్ నేతలు వారసులు కూడా ఓటమి రుచి చూశారు.  వారిలో ముఖ్యంగా ముఖ్యమంత్రి కుమారుడుగ, తెలుగుదేశం పార్టీకి కాబోయే నేతగా ఆ పార్టీ నేతలు చెప్పుకున్న లోకేశ్, అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. మంగళగిరి నుంచి పోటీ పడ్డ ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు.

అటు పలాస నుంచి పోటీ పడిన గౌతు లచ్చన్న కుమార్తె గౌతు శిరీష, విజయనగరం నుంచి బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు, అరకు నుంచి పోటీ చేసిన దివంగత కిడారి కుమారుడు కిడారి శ్రావణ్ లు కూడా ఓటమి పాలయ్యారు. ఇక అనంతపురంలో జేసీ వారసులు పవన్ కుమార్ రెడ్డి(అనంతపురం ఎంపీ), అస్మిత్ రెడ్డి(తాడిపత్రి)లు కూడా ఓటమి నుంచి తప్పించుకోలేక పోయారు.

ఇక వీరితో పాటు కాగిత కృష్ణప్రసాద్ (పెడన), షబానా ఖాతూన్ (విజయవాడ పశ్చిమ), దేవినేని అవినాశ్ (గుడివాడ), బొజ్జల సుధీర్ (శ్రీకాళహస్తి), గాలి భానుప్రకాశ్ (నగరి), పరిటాల శ్రీరామ్ (రాప్తాడు), టీజీ భరత్ (కర్నూలు), కేఈ శ్యామ్ (పత్తికొండ)లున్నారు. ఇక ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వారసుల జాబితాలో బాలకృష్ణ అల్లుడు ఎం భరత్ (విశాఖ), మురళి మోహన్ కోడలు మాగంటి రూప (రాజమండ్రి), బాలయోగి తనయుడు హరీష్(అమలాపురం) ఓడిపోయారు.

మామాట: ఏపీ ప్రజలకి వారసత్వ రాజకీయాలు నచ్చేలేదు అనుకుంటా

Leave a Reply