బీజేపీ ఓటమి వైసీపీకి కలిసి రానుందా?

cm jagan serious discussion on sand issue in ap
Share Icons:

అమరావతి:  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ దూసుకెళుతుంది. ఏడు లోకసభ స్థానాల పరిధిలోనూ ఆప్ దంచికొడుతోంది. 55 సీట్లలో ఆప్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తుండగా, బీజేపీ మాత్రం 15 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. చాందినీ చౌక్ లోకసభ పరిధిలో ఆప్ 8 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంవైపు దూసుకెళ్తోంది. ఈస్ట్ ఢిల్లీ లోకసభ పరిధిలో కూడా చీపురు పార్టీ 7 స్థానాల్లో దూసుకెళ్తుండగా, ఇక బీజేపీ మూడు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. న్యూఢిల్లీ లోకసభ పరిధిలో కూడా ఆప్ 7 స్థానాల్లో ముందంజలో ఉండగా, బీజేపీ కేవలం 3 స్థానాల్లోనే తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

ఇదిలా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీల్లో జోష్ నింపుతోంది. దీనికి కారణం ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగే రాజ్యసభ ఎన్నికలే. రాజ్యసభలో ఈ ఏడాది ఏప్రిల్ లో ఖాళీ అవుతున్న స్ధానాలను ఎలాగైనా గెల్చుకుని మెజారిటీ అందుకోవాలని భావిస్తున్న బీజేపీకి హస్తిన ఫలితాలు శరాఘాతంగా మారనున్నాయి. ఆప్ గరిష్టంగా 20 స్ధానాలు గెల్చుకున్నా రాజ్యసభ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు అవి ఎటూ సరిపోవు. అదే సమయంలో రాజ్యసభలో బీజేపీ మెజారిటీ సాధించకుండా తమపై ఆధారపడాలని భావిస్తున్న వైసీపీ, టీఆర్ఎస్, జేడీయూ, బీజేడీ, ఆర్జేడీ వంటి ప్రాంతీయ పార్టీలకు ఈ విజయం గొప్ప ఊరటనిస్తోంది.

ఇక ఈ ఏడాది ఏప్రెల్ లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా నాలుగు స్ధానాలు గెల్చుకునే అవకాశం దక్కింది. అదే సమయంలో అన్నా డీఎంకేతో పాటు బీజేడీ వంటి పార్టీలు సైతం ఆయా రాష్ట్రాల్లో తమకున్న అసెంబ్లీ స్ధానాల ఆధారంగా ఖాళీఅయ్యే ఎంపీ సీట్లు గెల్చుకుని రాజ్యసభలో మరింత బలపడే అవకాశముంది. వీటికి అడ్డుకట్ట వేయాలంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తప్పనిసరిగా మారింది. అందుకే బీజేపీ అధిష్టానం హస్తినలో కేంద్రమంత్రులను, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం మోహరించింది. అయినా మెజార్టీ స్ధానాలు గెల్చుకోవడంలో కాషాయ దళం విఫలమైంది.

అయితే ఢిల్లీ పరిణామాలు కచ్చితంగా తమకు మేలు చేసేవిగానే ఉంటాయని వైసీపీ అధిష్టానం అంచనా వేస్తోంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇది తమకు ఉపకరిస్తుందని వైసీపీ భావిస్తోంది. అటు టీడీపీ కూడా ఆప్ విజయాన్ని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నా ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో బయటికి ఏమీ మాట్లాడలేని పరిస్ధితుల్లో ఉంది.

 

Leave a Reply