కోడీ… కోడీ… పందెం మానవా?

Share Icons:

కోడిపందాలపై ఎడతెగని చర్చ

ప్రతి సంక్రాంతికి ఒక చర్చ విస్తృతంగా జరుగుతుంది- అది కోడిపందాల గురించి. కోడిపందాలకు అనుకూలంగా, వ్యతిరేకంగా వాదించే వారు వాదనలకు సిద్ధంగా ఉంటారు. ఎవరి వాదన వారిదే.

కోడిని కోసుకుని తినడం తప్పు కాదు కానీ వాటితో పందాలు నిర్వహించడం తప్పా అని ప్రశ్నించేవారు సిద్ధంగా ఉంటారు.

కోడిపందాలు నిర్వహించడం జంతుహింస కిందకు వస్తుందని మరికొందరు అంటారు. చట్టం తన పని తాను చేసుకుని వెళ్లాలని మరికొందరు ఆశిస్తారు.

పండుగల నిర్వహణలో ఇటీవల తరచూ వివాదాలు రేగుతున్నాయి. తేదీల విషయంలోనో, తిథుల విషయంలోనో కూడా వివాదాలు వస్తున్నాయి.

గతంలో కనీసం తెలుగుప్రజలు అందరూ అయినా ఒకేసారి పండుగ జరుపుకునేవారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోతున్నది.

తెలంగాణ ప్రభుత్వం ఒక రోజు సెలవు ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక రోజు సెలవు ఇస్తున్నది. సంక్రాంతి విషయానికి వస్తే అది మన పండుగ కాదు అని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పేవారు.

తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాది అయితే సంక్రాంతికి సెలవులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కొంచం పరిస్తితి మారి కనీసం శలవులు అయినా ఇస్తున్నారు.

ఆంధ్రా ప్రాంతంలో సంక్రాంతి సంబురాలలో ముఖ్యంగా ఉండేవి కోడిపందాలే. కోడిపందాలు రాష్ట్రం మొత్తంమీదా అన్నీ చోట్లా జరగవు. కేవలం పశ్చిమ గోదావరి జిల్లా లోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే నిర్వహిస్తారు.

ఆ ప్రాంతాలకు ఇతర జిల్లాల వారు కూడా వెళ్తారు. గత ఏడాది సంక్రాంతికి అయితే ఆంధ్రా ప్రాంతంలో కోడి పందాలపై నిషేధం ఉన్నందున తెలంగాణ భూభాగంలో కోడి పందాలు నిర్వహించారు.

ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కోడిపందాలు నిర్వహించిన సంఘటనలు ఉన్నాయి.

ఇలా ఒక రాష్ట్రంలో నిషేధం ఉన్నందువల్లనైనా ఇంకో రాష్ట్రంలోనైనా సంక్రాంతి సంబురాలు జరిగినందుకు సంతోషపడాలో కోర్టు ఆదేశాలు ధిక్కరించేందుకు కొత్త ఐడియాలు వేస్తున్నందుకు బాధపడాలో అర్ధం కేవడం లేదు, ఇది వేరే విషయం.

మొత్తానికి కోడిపందాలు జరపాలా వద్ద అనేది చట్టానికి లోబడి ఉండాలనేది మాత్రం ఖచ్చితం.

పూర్వకాలంలో కోడిపందాలను సరదా కోసం నిర్వహించే వారు. ఆ తర్వాత కాలంలో అవి పంతాలకు పట్టింపులకు దారితీసేవి.

ఆ తర్వాతి కాలంలో కోడిపందాలు ఒక జూదంగా మారాయి. పెద్దయెత్తున బెట్టింగులు మొదలయ్యాయి.

కోడిపందాలు సంక్రాంతి సంబురాల్లో భాగంగా ఉంటే ఫర్వాలేదు కానీ జూదంగా మారడం మాత్రం మంచిది కాదు.

దీనివల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి. అందుకే పండుగ సంబురాలు జూదం లాగా మారడాన్ని అంగీకరించరాదు.

Leave a Reply