దుమ్మురేపుతోన్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ట్రైలర్….

dear comrade trailer released
Share Icons:

హైదరాబాద్:

పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్రస్తుతం విజయ్, ర‌ష్మిక మంద‌న్నా హీరోహీరోయిన్లుగా మ‌రోసారి క‌లిసి న‌టించిన చిత్రం `డియర్ కామ్రేడ్‌`. భ‌ర‌త్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.

 

ఈ నెల 26వ తేదీన విడుద‌ల‌వుతున్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర‌బృందం తాజాగా విడుద‌ల చేసింది. మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైల‌ర్‌తో క‌థ గురించి ముందే క్లారిటీ ఇచ్చారు. అలాగే విడుదలైన నాలుగు గంటల్లోనే ఈ సినిమా ట్రైలర్ దాదాపు 2 మిలియన్ వ్యూస్ కి చేరువైంది. ఇందులో కొన్ని డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి

 

 

`వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్లిపోయేటప్పుడు ఎందుకింత బాధ పెడుతోంది` అంటూ విజ‌య్ చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. అలాగే విజ‌య్‌, రష్మిక మ‌ధ్య లిప్‌లాక్ సీన్లను కూడా ట్రైల‌ర్‌లో చూపించారు.ఈ నెల 26న తెలుగుతోపాటు అన్ని ద‌క్షిణాది భాష‌ల్లోనూ ఈ సినిమా విడుద‌ల కాబోతోంది.

Leave a Reply