కరుణ సతీమణికి అస్వస్థత

Share Icons:

చెన్నై, ఆగస్టు 29,

 

దివంగత డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్ చెన్నైలోని అపొల్లో ఆస్పత్రిలో చేరారు. మంగళవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి యాజమాన్యం ఇంకా ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు. ఇవాళ దయాళు అమ్మాళ్ ఆరోగ్యం పరిస్థితిపై హెల్త్ బులిటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. కరుణానిధి రెండవ భార్య, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తల్లి దయాళు అమ్మాళ్‌కు మరో ఇద్దరు కుమారులు ఎంకే అళగిరి, ఎంకే తమిళరసు, కుమార్తె ఎంకే సెల్వి ఉన్నారు. డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికైన రోజే ఆమె అస్వస్థతకు గురికావడం గమనార్హం.

కరుణానిధి మరణంతో దాదాపు ఐదు దశాబ్దాల అనంతరం పార్టీ చీఫ్ పగ్గాలను ఆయన కుమారుడు స్టాలిన్ చేపట్టారు. డీఎంకే తొలి అధ్యక్షుడిగా కరుణానిధి 1969లో బాధ్యతలు చేపట్టగా.. 65 ఏళ్ల స్టాలిన్ డీఎంకే రెండో అధ్యక్షుడిగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. తండ్రి బతికుండగానే డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఎంకే అళగిరి నుంచి స్టాలిన్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తనను పార్టీలోకి తీసుకోకుంటే ‘‘తీవ్ర పరిణామా లుంటాయని’’ అళగిరి హెచ్చరిస్తుండగా… తనకు సోదరుడే లేడంటూ స్టాలిన్ వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.

మామాట: కరుణ కుటుంబంలో వరుస కష్టాలా..

Leave a Reply