మామ వేధింపులు… కోడలి ఆత్మహత్య

Share Icons:

పెద్దపల్లి, జూన్ 13:

స్వయానా మేనమామ. తల్లి తరువాత తల్లిలాంటి వాడు… ఆపై తన భర్తకు తండ్రి ఏ ఆడబిడ్డకైనా ఇలాంటి మెట్టినిల్లు దొరకడమే అదృష్టం. అదే జరిగింది. అయితే మేనమామ… కామంతో పగబట్టిన నాగుపాములా తయారయ్యాడు. కోడలుగా మారిన మేనకోడలును వేధించాడు. ఆమె చావుకు కారణమయ్యాడు. పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం ఊటూరు గ్రామానికి చెందిన కొమురయ్య కూతురు ముత్యాల కోమలత (23)ను ఆరు నెలల క్రితం పెద్దపల్లి జిల్లా మద్దికుంట గ్రామానికి చెందిన ఈర్ల విజయ్‌కి ఇచ్చి పెళ్లి చేశారు. కోమలత తల్లికి కొమురయ్య స్వయాన సోదరుడే. అయినా రూ.15 లక్షల కట్నం, కానుకలు ఇచ్చారు. విజయ్‌ కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కావడంతో కూతురు సంతోషంగా ఉంటుందనుకున్నారు.

కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. విజయ్‌ ఉద్యోగాన్ని వదులుకుని ఇంటిదారి పట్టాడు. వ్యాపారం కింద హార్వెస్టర్‌ కొనుగోలు చేస్తానని చెప్పడంతో కోమలత పుట్టింటివారు మరో రూ.5 లక్షలు విజయ్‌కి ఇచ్చారు. ఇక్కడ నుంచి అసలు కథ ప్రారంభమయ్యింది.

కోడలిపై పగబట్టిన కొమరయ్య

స్వయానా మేనకోడలే అయినా.. ఈర్ల కొమురయ్యకు ఆమెను అనుభవించాలనే పాడు బుద్ధి పుట్టింది. కొడుకు ఇంట్లో ఉన్నంత వరకూ తన ఆటలు సాగవని తెలుసుకున్నాడు. అంతే కుమారుడికి దీక్ష ఇప్పించి రెండు నెలల పాటు దూరం పెట్టేశాడు. ఇక ప్రతీ రోజు తన కోరిక తీర్చాలంటూ కోడలిని లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. చాలా కాలం భరించిన కోమలత చివరకు ఈ విషయం కులపెద్దలకు చెప్పింది.

కులపెద్దలు కొమరయ్యను మందలించారు. ఇలా రెండు సార్లు జరిగింది. అయినా వేధింపులు ఆగలేదు. దీంతో తీవ్రమస్తాపం చెందిన కోమలత మంగళవారం తన అత్తారింట్లోనే ఉరివేసుకొని చనిపోయింది. కుటుంబసభ్యులు మృతదేహాన్ని పెద్దపల్లి ఆస్పత్రికి తరలించగా, ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా భర్త, అత్తమామలు పరారయ్యారు.

మామాట : తల్లిదండ్రుల్లాంటి అత్తమామలే పగబడితే….

Leave a Reply