దోమల వలన వచ్చే భయంకరమైన వ్యాధులివే..

dangerous diseases by mosquitoes
Share Icons:

హైదరాబాద్:

వర్షాకాలం వచ్చేసింది. మురుగు గుంటల్లో నిల్వ ఉండే నీటి వల్ల దోమల బెడద ఎక్కువైపోతుంది. దోమ కాటు వేస్తే ఎన్నో రకాల వ్యాధులు వచ్చి మంచాన పడి చనిపోయినవారు చాలమందే ఉన్నారు.  దోమకాటు వలన మనకి తెలిసిన తెలియని వ్యాధులెన్నో.. అయితే దోమ కాటు వలన వచ్చే భయంకరమైన ప్రాణాంతకమైన వ్యాధులు కొన్ని ఉన్నాయి అవేంటో చూద్దాం..

  1. మలేరియా:

దశాబ్ధాల తరబడి మనుషుల్ని ఒణికిస్తూ దోమకాటు వల్ల వ్యాప్తి చెందే భయంకమైన వ్యాధి మలేరియా. ఈ వ్యాధికి ఎన్ని వ్యాక్సినేషన్స్ ఉన్నా సరే మనిషిని పూర్తిగా పీల్చి పిప్పి చేస్తుంది. దీనివల్ల డయేరియా లక్షణాలు కూడా కనిపిస్తాయి. విపరీతమైన తల నొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం, నీరసంతో మనిషిలోని సత్తువని పీల్చేస్తుంది.

  1. డెంగ్యూ జ్వరం..

డెంగ్యూ జ్వరం భారతీయుల్ని ఏ విధంగా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఏడెస్ ఏజిప్టి దోమల జాతి ద్వారా వ్యాప్తి చెందుతుంది.చాలామంది డెంగ్యూ వ్యాధి కారణంగా మరణించిన వారిని మనం గత నుండి చూస్తూనే ఉన్నాం. దీని వల్ల కూడా విపరీతమైన ఒళ్ళు నొప్పులు, తీవ్ర చలి జ్వరం ఉంటుంది.

  1. జికా వైరస్..

ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా జికా వైరస్ గురించే మాట్లాడటం మొదలు పెట్టారు. ఏడెస్ ఏజిప్టి దోమల జాతి ద్వారానే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికీ మన దేశంలోని విమానాశ్రయాల్లోనూ, బస్టాండుల్లోనూ జికా వైరస్ వ్యాధి లక్షణాల గురించి, దాని వ్యాక్సినేషన్ గురించి అనేక రకాల బోర్డులు చూడవచ్చు. ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన వ్యాధే.

  1. చికున్ గున్యా:

దోమల ద్వారా వ్యాప్తి చెంది రోగ నిరోధక శక్తిని హరించి వేసే మహమ్మారిగా చికున్ గున్యాని చెప్పవచ్చు. ఇది కూడా డెంగ్యూ, జికా మాదిరిగానే ఏడెస్ ఏజిప్టి దోమల జాతి ద్వారానే వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి అవయవాలను దెబ్బ తీసి ప్రాణం మీదకు తెస్తుంది.

  1. సెల్వ్

వ్యాధి అనేది అరుదుగా సంభవించే వ్యాధి. ఇది ప్రపంచంలోని కేవలం ఏడుగురిపైనా మాత్రమే ఇప్పటి వరకూ ప్రపంచంలో కేవలం 7గురు మాత్రమే ఈ వ్యాధి భారిన పడ్డారు. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. దోమల ద్వారా తలెత్తే ఈ వ్యాధి మెదడుని దెబ్బ తీస్తుంది. జ్వరం, తలనొప్పి, గందరగోళంతో మొదలయ్యే ఈ వ్యాధి క్రమేపీ  కోమా, కన్వల్షన్స్, పరాలసిస్ వంటి దారుణమైన పరిస్థితులకు దారి తీస్తుంది.

  1. వెస్ట్ నైల్…

దోమల వల్ల వ్యాప్తి చెందిన వైరల్ వ్యాధుల్లో ఇది కూడా ఒకటి. తొలుతగా ఇది ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నైల్ నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉద్భవించిందని చెబుతారు. క్రమేపీ ప్రపంచ దేశాలకు వ్యాపించింది. అయితే ఈ వ్యాధిలో మాత్రం ఎటువంటి లక్షణాలు కనిపించవు. కొందరిలో మాత్రమే ఫ్లూ జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమేపీ ఈ వ్యాధి శరీరంలోని అన్నీ భాగాలకు లోలోపల చెరీ మరణం వరకూ దారి తీస్తుంది.

మామాట: ఈ భయంకరమైన వ్యాధుల గురించీ నలుగురికీ తెలిసేలా చెయ్యండి..

 

Leave a Reply