TRENDING NOW

యూపీలో బీజేపీకి షాక్… పార్టీకి రాజీనామా చేసిన సావిత్రి ఫూలె

యూపీలో బీజేపీకి షాక్… పార్టీకి రాజీనామా చేసిన సావిత్రి ఫూలె
views:
1

లక్నో, 6 డిసెంబర్:

కొంతకాలంగా సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దళిత ఎంపీ సావిత్రి బాయి ఫూలె.. ఈరోజు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆమె పార్టీకి రాజీనామా చేసిన ఎంపి పదవికి మాత్రం రాజీనామా చేయలేదు.

బహ్రెయిచ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సావిత్రి మీడియాతో మాట్లాడుతూ…పదవీకాలం ముగిసే వరకు ఎంపీగా కొనసాగుతానని స్పష్టంచేశారు. రాజకీయాల కోసం సమాజంలో విభజన తెస్తోందని..ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని మండిపడ్డారు.

ఇక ఈరోజు నుంచి బీజేపీతో తనకు సంబంధం లేదని, దళిత్ అయినందునే తనని పార్టీ విస్మరించిందని మండిపడ్డారు. ఇక దళితులకు వ్యతిరేకంగా బీజేపీ కుట్ర చేస్తోందని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కూడా మెల్లగా తొలగిస్తారని ఆరోపించారు.
అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సావిత్రి బాయి ఫూలె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో హనుమంతుడు దళితుడన్న ఆయన వ్యాఖ్యలను సావిత్రి ఫూలె ప్రస్తావించారు. హనుమంతుడు దళితుడే..కానీ మనువాదులకు వ్యతిరేకమని ఆమె చెప్పారు. హనుమంతుడు దళితుడు అయినందునే..రాముడు ఆయన్ను కోతిని చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులపై యూపీ సీఎం కపట ప్రేమ చూపిస్తున్నారని..ఆయన్ను ఎవరూ నమ్మవద్దని విమర్శించారు.

మామాట: ఈ రాజీనామాపై బీజేపీ పార్టీ ఎలా స్పందిస్తుందో..

(Visited 15 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: