మామిడికాయలు కోశాడని దళితుడుని చంపేశారు…

Share Icons:

తూర్పుగోదావరి, 30 మే:

మామిడికాయలు కోశాడనే నెపంతో కొందరు దుర్మార్గులు దళితుడిని కొట్టి చంపి, ఆపై ఉరేసుకుని మృతి చెందినట్లుగా చిత్రీకరించారు. ఈ దారుణ ఘటన్ తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. బాధితుని కుటుంబం సంచారం  ప్రకారం… తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడకు చెందిన బత్తి శ్రీను (32) బుధవారం తన భార్యా పిల్లలను రంగంపేటలోని అత్తింటికి తీసుకెళ్లాడు. ఇక వారిని ఇంటి దగ్గర వదిలేసి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో సింగంపల్లి వద్ద మామిడితోటలోని మామిడి పండ్లను కోసుకుని తిన్నాడు.

ఇక ఇది చూసిన తోట కౌలుదారులు కడియం నాగేశ్వరరావు, ఎం.రామకృష్ణ దళితుడ్ని తీవ్రంగా కొట్టారు. అయితే ఆ దెబ్బలకి శ్రీను అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే వారు సింగంపేటలోని పంచాయతీ కార్యాలయంలో శ్రీనునే ఉరేసుకున్నట్లు చిత్రీకరించారు.

ఇక విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు…పోలీసులకి ఫిర్యాదు చేశారు. శ్రీనును పెత్తందార్లే హత్య చేసి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇక పెద్దాపురం డిఎస్‌పి సిహెచ్‌.రామారావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని…ఘటన స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. 

మామాట: దుర్మార్గులు మరి దారుణంగా చేశారు

Leave a Reply