
టిబెట్ , ఆగష్టు 10,
క్షమించండి, నా వాఖ్యలు వివాదాస్పదమయ్యాయి, ఒక వేళ నేను ఏదైనా తప్పు చెప్పి ఉంటే క్షమాపణ కోరుతున్నాను… అంటూ టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత వారం ఆయన విద్యార్థులతో మాటా మంతీ కలుపుతూ…
స్వతంత్ర్యానికి ముందు జిన్నాను ప్రధానిగా అంగీకరించి ఉంటే భారత్ విభజన జరిగి ఉండేది కాదు, నిజానికి మహాత్మాగాంధీ కూడా జిన్నాకే మద్దతిచ్చారు. అయితే ప్రధాని కావాలనే నెహ్రూ గట్టి పట్టుదల కారణంగా గాంధీ దిగివచ్చారన్నారు. అంతే కాకుండా నెహ్రూ వ్యక్తిస్వామ్యం కోరుకునేవారని కూడా లామా అభిప్రాయ పడ్డారు. అయితే దీనిపై కాంగ్రెస్ సహా పలువురు అభ్యంతరం వ్యక్తంచేయడంతే తనవాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నట్టు దలైలామా ప్రకటించారు.
మామాట: దీన్నే మా వూర్లో అడుసు తొక్కనేల కాలు కడగనేల అంటారు.