ఒలింపిక్స్‌ గేమ్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఐసీసీ

team india won t20 series against west indies
Share Icons:

ఢిల్లీ:

 

అంతర్జాతీయ క్రికెట్ మండలి సరికొత్త నిర్ణయం దిశగా వెళుతుంది. ఇప్పటికే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ని ప్రారంభించిన ఐసీసీ.. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ గేమ్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఐసీసీ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.  అయితే క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టడంపై ఐసీసీ..మెరిల్‌బోన్‌ క్రికెట్‌ కమిటీ(ఎంసీసీ) సమావేశంలో చర్చించింది. అలాగే దానికి సంబంధించి కార్యచరణను వేగవంతం చేసింది. ఇక దీనిపై ఎంసీసీ చైర్మన్‌ మైక్‌ గాటింగ్‌ మాట్లాడుతూ. 2028లో క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూస్తామని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే క్రికెట్ ఒలింపిక్స్‌కు ఎలా అర్హత పొందాలి అనే దానిపైనే ప్రధానంగా కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.

 

కాగా, ఒలింపిక్స్‌ నిబంధనల ప్రకారం అన్ని క్రీడా సమాఖ్యలు అంతర్జాతీయ డోపింగ్‌ వ్యతిరేక ఏజెన్సీ (వాడా) పరిధిలోకి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాడాకి అనుబంధంగా ఉన్న జాతీయ డోపింగ్‌ నిరోధక ఏజెన్సీ (నాడా) పరిధిలోకి బీసీసీఐ రావడం కూడా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ప్రవేశానికి మార్గం సుగమమైంది.

 

ఇదిలా ఉంటే 1998 తర్వాత కామన్వెల్త్‌ గేమ్స్‌లో మళ్లీ క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి కామన్వెల్త్‌ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్‌) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితమే కామన్వెల్త్‌లో మహిళల టీ20 క్రికెట్‌ను చేర్చడానికి అంగీకారం తెలిపిన సీజీఎఫ్‌.. మంగళవారం దాన్ని ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. 2022లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా నిర్వహించే కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల టీ20 క్రికెట్‌ జరగనుంది.

Leave a Reply