ఆ పార్టీల వల్ల ప్రజలకి మేలు లేదు…

Share Icons:

హైదరాబాద్, 14 ఫిబ్రవరి:

టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల వల్ల ప్రజలకు జరిగిన మేలు ఏమీలేదని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

ఈరోజు జరిగిన సీపీఎం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…నల్గొండలో పార్టీ రాష్ట్ర మహాసభలు విజయవంతంగా పూర్తి చేశామని, అందులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానలపై చర్చించమని చెప్పారు.

అలాగే రెండు నెలల్లో జరుగబోయే అఖిలభారత మహా సభలు ఏ విధంగా జరగాలి అనే దానిపై కూడా చర్చించామని ఆయన తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో ఏ పార్టీతో పొత్తు ఉండబోదని, అఖిలపక్షంలోకి సీపీఎం వస్తుందని కొన్ని పత్రికల్లో రాశారని, అది వాస్తవం కాదని అన్నారు.

ఇక రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన విషయాలపై కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి   దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల వల్ల ప్రజలకు జరిగిన మేలు ఏమి లేదని విమర్శించారు. కాబట్టి మరో  ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు బిఎల్ఎఫ్‌ని ముందుకు తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే గోల్కొండ చౌరస్తాలో బిఎల్ఎఫ్ కార్యాలయం ప్రారంభిస్తామని వీరభద్రం చెప్పారు.

మామాట: ఏ పార్టీ వల్ల ప్రజలకి మేలు ఉందో..?

English summary:

Telangana CPM state secretary Veerabhadram said TRS and Congress parties have nothing to do the people. And he said in the Nalgonda’s party state meeting has been successfully completed.

Leave a Reply