సబ్సిడి కోతకు సన్నాహాలు

Share Icons:

హైదరాబాద్, 27జనవరి:

సంక్షేమ పథకాల సబ్సిడీ కోతను పెంచేందుకు కేంద్రం ప్రతిపాదనలు తెస్తోందని, ద్రవ్యలోటు మరింత పెరుగనుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు హెచ్చరించారు.

ఎంబీ భవన్‌లో సీపీఎం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాలకు  ఆయన హాజరయ్యారు. త్వరలో ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో మరింత వేగంగా సంస్కరణలు చేయనున్నట్లు సమాచారం వస్తోందని మీడియాతో తెలిపారు.

వ్యవసాయానికి భరోసా ఇచ్చేలా నిధులు కేటాయించాలని, జహీరాబాద్..జడ్చర్ల..దామరచర్లలో..డ్రైపోర్టుల మంజూరులో కేంద్రం విఫలం చెందిందని విమర్శించారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రం నుండి రూ. 15వేల కోట్ల ఎగుమతులు తగ్గిపోయాయని తెలిపారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఎంఎంటీఎస్ వంటి పథకాలను పూర్తి చేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని ఆయన అన్నారు.

కాగా ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు…

కేంద్ర ప్రభుత్వ అన్యాయాన్ని తెలంగాణా సర్కారు ప్రశ్నించలేకపోతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. బిజెపి, ఎంఐఎంలతో టిఆర్‌ఎస్‌ దోస్తీ చేస్తోందన్నారు. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ను బలోపేతం(బిఎల్‌ఎఫ్‌) చేసే దిశగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.

బిఎల్‌ఎఫ్‌లోకి సిపిఐని ఆహ్వానించామని, అఖిలభారత మహా సభలయ్యేవరకు తమ అభిప్రాయాన్ని చెప్పలేమని వారు పేర్కొన్నారన్నారు. సానుకూల స్పందన వస్తుందని తాము భావించడంలేదని  అభిప్రాయపడ్డారు.

మామాట: కాంగ్రెస్, టీడీపీతో జట్టుకు సీపీఎం రెడీ

English Summary:  CPM state committee meeting held in the MB Bhavan. Members of the CPM Polit Bureau participated in these meetings. The media is reported to be making more rapid reforms in the Union budget soon to be introduced.

Leave a Reply