TRENDING NOW

బాబూ..నాలుగేళ్ళు అంటకాగి ఇప్పుడు నీతులు చెబుతున్నవా…

బాబూ..నాలుగేళ్ళు అంటకాగి ఇప్పుడు నీతులు చెబుతున్నవా…

విజయవాడ, 20 జూన్:

బీజేపీతో నాలుగేళ్లు అంటకాగిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతున్నారని సీపీఎం జాతీయ నేత రాఘవులు విమర్శించారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ నేత సీఎం రమేష్ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తున్నారని, మరి ఈ నాలుగేళ్ల నుంచి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఆయన చేసే దీక్షలో చిత్తశుద్ధి లేదని, ఏ సమస్యపైనైనా తాము దీక్షలు, నిరసనలు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం తమను అరెస్టు చేస్తుందని విమర్శించారు.

ప్రభుత్వం వారు దీక్ష చేస్తే ప్రజస్వామ్యం, తాము చేస్తే అరాచకమా? అని ప్రశ్నించారు.

అలాగే ఆయన కేంద్రప్రభుత్వంపైనా కూడా విమర్శలు చేశారు. మన దేశ రక్షణ వ్యవస్థను అమెరికా చేతిలో కేంద్ర ప్రభుత్వం పెడుతోందని ఆరోపించారు.

రాష్ట్ర విభజన చట్టంలో ఎన్నో హామీలైతే ఇచ్చారు కానీ, ఏపీకి చివరకు, బెల్లం ముక్క కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అనైతికంగా విభజించారని, ఏపీకి  ప్రత్యేక హోదా పదిహేనేళ్లు కావాలని కోరిన వెంకయ్యనాయుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఇక రాష్ట్ర విభజనకు సీపీఎం వ్యతిరేకమని ఎప్పుడో ప్రకటించామని అన్నారు.

మామాట: అంతా రాజకీయం కోసమే కదా…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: