చంద్రబాబు నక్కజిత్తుల రాజకీయాన్ని ప్రజలు నమ్మరు….

CPM leader b raghavulu fires on tdp ysrcp bjp
Share Icons:

విశాఖపట్నం, 1 సెప్టెంబర్:

ఈనెల 15న విజయవాడలో నిర్వహించే మహాగర్జనకు ప్రజలను సమాయత్తం చేస్తూ శనివారం విశాఖపట్నంలో సీపీఎం, సీపీఐ బస్సుయాత్ర నిర్వహించింది. ఈ సందర్భంగా సీపీఎం నేత బీ. రాఘవులు మాట్లాడుతూ… ప్రత్యేక హోదాపై టీడీపీ మాట మార్చిందని, సీఎం చంద్రబాబు నక్కజిత్తుల రాజకీయాన్ని ప్రజలు నమ్మరని అన్నారు.

టీడీపీ, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదని, బీజేపీకి వైసీపీ వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ పోరాటాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రతిపక్ష నేత జగన్ బీజేపీతో కలిసి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని రాఘవులు దుయ్యబట్టారు.

అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. 2014కు ముందే విశాఖ రైల్వే జోన్‌ కోసం రైల్వే పోరాట సాధన కార్యాచరణ కమిటి వేశారని తెలిపారు. అధికారంలోకి వస్తే విశాఖ రైల్వే జోన్‌ ఇస్తామన్న టీడీపీ, వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలను నయవంచన చేశారన్నారు.

అలాగే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ..పిటిపిఐఆర్‌ పేరిట చంద్రబాబు లక్షల ఎకరాల భూముల్ని లాక్కున్నారని తెలిపారు. అమరావతిలోలానే లాండ్‌పూలింగ్‌ పేరిట విశాఖలో కూడా చేయాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

మామాట: మరి ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు..రాఘవులు గారు…..

Leave a Reply