కేరళకు సీపీఐ సహాయం

CPI party helps kerala
Share Icons:

విజయవాడ, ఆగష్టు 28:

కేరళ వరద బాధితులకోసం సరుకులు, మందులు, బియ్యం, బట్టలు విరాళాలు సీపీఐ పార్టీ సేకరించింది. అలాగే 15లక్షల విలువైన సామగ్రి వెళ్తున్న వాహనంకి ఆ పార్టీ జాతీయ నాయకుడు నారాయణ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ…కేరళ సహజ సిద్ధమైన అందాలతో ఉండేదని, మరో 50, 60ఏళ్ళు వచ్చిన పూర్వ వైభవం వస్తుందో…లేదోనని అన్నారు. విజయవాడలో ప్రతిఒక్కరు సహాయం అందించారని, ఇది కేవలం ఉడతా భక్తి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

ఇక దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాలు అన్ని సహాయం అందించాయని, కేరళకు సహాయం అందించటంలో కేసీఆర్‌ని మెచ్చుకోవాలని, అందరికంటే ఎక్కువగా స్పందించారని తెలిపారు.  విగ్రహాలకు అయ్యిన ఖర్చులో నాలుగో వంతు సహాయం చేసిన బావుండేదని, కక్ష అంటే మోదీదేనని మండిపడ్డారు.  కేరళ ప్రజలకు సహాయం అందించటంలో మోదీ విఫలం అయ్యారని, యూఏఈ  వాళ్ళు ప్రకటించిన 700 కోట్ల సాయానికి కూడా అడ్డుపడటం దారుణమని అన్నారు.

మామాట: కక్ష అంటే మోదీదేనా?

Leave a Reply