కేసీఆర్..ఇక నువ్వు ఫామ్‌హౌస్‌లో మిరపకాయలు పండించుకోవాల్సిందే…

Share Icons:

ప్రకాశం, 27 నవంబర్:

ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఎన్నికల అనంతరం కేసీఆర్‌ తన ఫాంహౌస్‌లో మిరపకాయలు పండించుకోవడం ఖాయమని ఎద్దేవా చేశారు.

ఇక ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న నారాయణ..బీజేపీపైనా కూడా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ వల్లనే దేశానికి ప్రమాదం పొంచి ఉందని, ప్రధాని నరేంద్ర మోదీకి తన భార్యపై ఎంత ప్రేమ ఉందో రామాలయంపైనా అంతే ప్రేమ ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతోనే మళ్లీ రామాలయ నిర్మాణాన్ని తెరపైకి తెస్తున్నారని, సీబీఐని ఇస్కో అంటే ఉస్కో అనేలా తయారు చేశారని విమర్శించారు. సీబీఐ, ఆర్బీఐ, ఎన్నికల వ్యవస్థలను మోదీ తన వంటింటి కుందేలు మాదిరిగా తయారు చేశారని ధ్వజమెత్తారు. 

వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇక ఎన్నికలు ఉండవని, రఫెల్‌ విమానాల స్పీడ్‌ కన్నా మోదీ అవినీతి ఇంకా స్పీడ్‌గా వెళ్తుందని నారాయణ ధ్వజమెత్తారు. ఇక వచ్చే ఏపీ ఎన్నికల్లో అనేక మార్పులు రాబోతున్నాయని నారాయణ తెలిపారు. 

మామాట: సెటైర్లు వేయడంలో నారాయణ ఎప్పుడు ముందే ఉంటారు…

Leave a Reply