బీజేపీకి ఏపీలో కూడా డిపాజిట్లు రావు…

CPI narayana fires on kcr and central goverment
Share Icons:

ఢిల్లీ, 4 జనవరి:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలాచోట్ల బీజేపీకి డిపాజిట్లు రాలేదని, ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పలితం పునరావృతం అవుతుందని సీపీఐ నేత నారాయణ జోస్యం చెప్పారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రత్యేకహోదా సాధన సమితి ధర్నా నేటితో రెండో రోజుకు చేరుకున్న వేళ ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇక ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం దగా చేసిందని విమర్శించారు. 2014లో తీసుకొచ్చిన ఏపీ పునర్విభజన చట్టాన్ని కూడా కేంద్రం పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పుట్టగతులు ఉండవని వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీలో ప్రత్యేకహోదా సాధన సమితి చేపడుతున్న ధర్నాకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాఘవులు, చలసాని శ్రీనివాస్ తదితరులు మద్దతు పలికారు.

మామాట: మీరు ఎలా చెబితే అలా నారాయణ గారు…

Leave a Reply