జగన్ బెయిలు రద్దయితే…?  సీపీఐ నారాయణ!

Share Icons:
  • రఘురామరాజు పార్లమెంటు సభ్యత్వం రద్దవుతుంది
  • జగన్ బెయిలు రద్దు చేయాలని పిటిషన్ తప్పే
  • జగన్ మరోమారు జైలుకు వెళ్తే అర్ధాయుష్షు పూర్ణాయుష్షు అవుతుంది

రఘురామా కృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలనీ పిటిషన్ వేయడం తప్పేనని సిపిఐ నారాయణ కుండబద్దలు కొట్టారు. ఒక వేళ రఘురామ రాజు కోరుకున్నట్లు బెయిల్ రద్దు అయితే జగన్ కు వచ్చే నష్టం ఏమిలేదని అన్నారు. జగన్ అర్థయషు కాస్త పూర్ణయ్షుగా మరుతున్నాడని అన్నారు.

వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బెయిలు రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్ వేయడం తప్పేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.. జగన్ బెయిలు రద్దు అవుతుందో, లేదో… కానీ రఘురామరాజు పార్లమెంటు సభ్యత్వం మాత్రం రద్దవుతుందని జోస్యం చెప్పారు. రఘురామరాజు కోరుకున్నట్టు బెయిలు రద్దయి జైలుకు వెళ్లినా జగన్‌కు వచ్చే నష్టం ఏమీ ఉండదన్నారు. గతంలో 16 నెలలు జైలులో ఉన్న జగన్ ఆ సానుభూతితో ఎన్నికల్లో గెలిచారని, మరోసారి జైలుకు వెళ్తే ఆయన అర్ధాయుష్షు కాస్తా పూర్ణాయుష్షుగా మారుతుందని నారాయణ వ్యాఖ్యానించారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply