విశాఖలో భూ మాఫియా: గంటా, ధర్మాన తనయుల దందాలు..

ap adminstration shifted visakhapatnam soon
Share Icons:

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు రాజధానుల అంశం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి క్లారీటీ ఇవ్వకపోయిన ప్రాంతాల వారీగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమరావతి రైతులు ఇప్పటికే ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో అమరావతిలోని రాజధానిని కొనసాగించాలని సీపీఐ పార్టీ తరపున నారాయణ డిమాండ్ చేశారు. ఏపీలోని 13 జిల్లాల ప్రజలకు సెంటర్ పాయింట్ అని వివరించారు. విశాఖపట్టణాన్ని రాజధాని చేస్తే.. రాయలసీమ వాసులు వెయ్యి కిలోమీటర్లు దాటి రావాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ప్రజల సౌకర్యం కోసం రాజధాని ఉండాలే తప్ప.. కక్షసాధించేందుకు రాజధాని మార్చాలనుకోవడం సరికాదన్నారు.

ఇక రాజకీయంగా చిన్న వయస్సులోనే జగన్ సీఎం అయ్యారని, మరో 30 ఏళ్లు సీఎంగా ఉండాలని అనుకొంటున్నారని నారాయణ గుర్తుచేశారు. ఈ క్రమంలో రాజధాని మార్పు సరికాదని సూచించారు. ఏటికి ఎదురీవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని గుర్తుచేశారు. గత అసెంబ్లీ సమావేశంలో జగన్ ఆమోదించిన తీర్మానాన్ని అమలు చేయాలని కోరారు. కాదు కూడదని అసెంబ్లీలో బలం ఉందని, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మూర్ఖంగా ముందుకెళ్లొద్దని సూచించారు.

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్టణం మారబోతుందన్న క్రమంలోనే రియల్ భూం వచ్చిందని చెప్పారు. భూ మాఫియాకు జాతి, కులం, మతం ఉండవని, వారంతా ఒక్కటేనని అన్నారు. టీడీపీకి చెందిన గంటా శ్రీనివాసరావు కుమారుడు కూడా భూకబ్జా దందాలో ఉన్నారని పేర్కొన్నారు. ఆయన విపక్ష టీడీపీకి చెందినవారు కదా అని ప్రశ్నించారు. భూ మాఫియా, కబ్జాకోరుల కులం ఒక్కటేనని చెప్పారు. ధర్మాన ప్రసాదరావు కుమారులు కూడా భూ మాఫియాలో ఉన్నారని గుర్తుచేశారు. వైసీపీ నేత తిప్ప నాగిరెడ్డి కూడా భూ మాఫియా చేస్తున్నారని తెలిపారు. రాజధానిపై వేసిన కమిటీలో వీరందరీ పేర్లు వచ్చాయని, అందుకే కమిటీ పేర్లను బహిర్గతం చేయలేదని నారాయణ గుర్తుచేశారు. రాజధానిని మాత్రం అమరావతిలోనే కొనసాగించాలని నారాయణ డిమాండ్ చేశారు.

 

Leave a Reply