పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి.

Share Icons:

హైదరాబాద్, 14 ఫిబ్రవరి:

సి‌పి‌ఎస్ విధానాన్ని రద్దు చేసి, తిరిగి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి సి‌పి‌ఎస్‌టి‌ఈ‌ఏ-టి‌ఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్ మెమోరాండం సమర్పించారు.

ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ.. సి‌పి‌ఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత విధానాన్నే కొనసాగించి ఉపాధ్యాయలకు, ఉద్యోగులకు న్యాయం చేయాలని ఎస్‌కే జోషిని కోరినట్లు చెప్పారు.

అలాగే ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎస్‌కే జోషి నియామకం అయిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో ఏ‌ఈ‌ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి‌వి.ప్రసాద్, టి‌యూ‌టి‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు స్వామిరెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లారావులు ఉన్నారు.

మామాట: మరి సి‌పి‌ఎస్ విధానాన్ని రద్దు చేస్తారా..?

English summary:

CPCTEA-TS State President Kamalakar memorandum presented the Telangana Chief Secretary SK Joshi to cancel the CPS policy and continue the old pension system.

Leave a Reply