అవినీతి సమ్రాట్ బాబు- జగన్

poll 61 corruption samrat chandra babu jagan
Share Icons:

వేయి గొడ్లను తిన్న రాబంధుకూడా ఒక్క గాలీ వానకు కూలిపోతుందని సామెత. ఇపుడు రాష్ట్రంలో జగన్ గాలి వీస్తోంది. బాబు అధికారవృక్షం కూకటి వేళ్లతో కూల నుంది.

[pinpoll id=”67730″]

తెలుగు వారిని రెండుగా విడగొట్టి, 2014 లో రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అటు తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రికాగా, ఇక్కడ నవ్యాంధ్రకు చంద్రబాబు సారథ్యం కోరుకున్నారు ప్రజలు. అయితే, ఈ ఐదు  సంవత్సరాలుగా రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందనేది ప్రధానవ ప్రతిపక్షం వాదన. నమ్మి అధికారం అప్పగించిన ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు.

దాదాపు ఏడాదిగా పాదయాత్ర చేస్తున్న జగన్ ఈ నెల 9 వతేదీన ఇచ్చాపురంలో తన యాత్ర ముగించవచ్చుననే వార్తల నేపథ్యంలో ఆదివారం అవినీతి చక్రవర్తి అనే పేరుతో చంద్రబాబు పాలనలో చోటు చేసుకున్న అవినీతి వివరాలతో ఓ పుస్తకం విడుదల చేశారు జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబు పాల్పడుతున్న అక్రమాలాకు ఆధారాలున్నాయనీ, తాము అధికారంలోకి రాగానే కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని, అవసరమైతే బాబు జైలుకు వెళ్లాల్సి ఉంటుందనీ చద్రబాబును విడిచిపెట్టే ప్రశ్నే లేదని జగన్ అంటున్నారు.

మామాట: ఇంత అవినీతి జరుగుతుంటే… శాసన సభలో ఎందుకు ప్రస్తావించలేదో.

 

Leave a Reply