మోదీ జీ నిరూపించండి… లోకేష్ సవాల్

Share Icons:

తిరుపతి, ఫిబ్రవరి 11,

తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో  అవినీతికి పాల్పడినట్టుగా రుజువు చేయాలని ఏపీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోడీ విమర్శలపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. అసలు ప్రధానమంత్రి మోడీ రాష్ట్రానికి ఎందుకు వచ్చినట్టో చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు.  గత లోక్ సభ ఎన్నికల్లో  ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తానని మోడీయే చెప్పారని లోకేష్ గుర్తు చేశారు. ఉపాధిహామీ స్కీమ్ రాష్ట్ర పధకమనీ, ఇందులో కేంద్రం ఇచ్చేదేముందన్నారు. ప్రత్యేక రైల్వేజోన్, కడప ఉక్కు ప్రధానికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ , ఎన్డీఏలో ఉన్న సమయంలో మా అవినీతి గుర్తు రాలేదా అని ఆయన  ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు బీజేపీ ద్రోహానికి తగిన గుణ పాఠం చెబుతారనన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని లోకేష్ అభిప్రాయపడ్డారు.  వచ్చే ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేసే వ్యక్తినే ప్రధానమంత్రిని చంద్ర బాబు చేస్తారని లోకేష్ చెప్పారు. ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మించుకోవాలని రూ.1500 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు.  ఈ నిధులతో రాజధాని ఢిల్లీని తలదన్నే నిర్మాణం సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు.

మామాట: అంతా మాట్లాడేవారే.. లెక్కలు చెప్పేవారు లేరు…

Leave a Reply