రోజురోజుకూ పెరుగుతున్న కరోనా: చైనాలో పెరిగిన మృతుల సంఖ్య…

Coronavirus update: 170 killed, evacuations begin, While House may ban all US-China flights
Share Icons:

బీజింగ్: భయంకర కరోనా వైరస్ అగ్రదేశం చైనాని వణికిస్తుంది. వుహాన్ నగరంలో మొదలైన ఈ వైరస్ దాదాపు 17 నగరాల వరకు పాకింది. ఒక్కరోజులోనే దాదాపు 50మంది వరకు చనిపోయారు. మొత్తం మీద 170 మంది వరకు చనిపోగా, 7వేలుకు పైనే ఈ వ్యాధి సోకినట్లు సమాచారం. రస్ సోకినట్టు గుర్తించిన వారిలో 1370 మంది పరిస్థితి ఆందోొళనకరంగా ఉన్నట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. కొత్తగా మరో 1700 మంది వైరస్ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. కరోనా వైరస్ సోకిందా? లేదా? అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. వైరస్‌ను నియంత్రించడానికి చైనా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. ఫలితం లేకుండా పోతోంది.

అటు చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో సుమారు వంద కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వందమంది రక్త నమూనాలను పరిశీలించగా.. అది పాజిటివ్‌గా తేలింది. రాజధాని బీజింగ్‌లో కొత్తగా మరో 111 కేసులు గుర్తించారు. వారందర్నీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్‌ను నయం చేయడానికి అవసరమైన మందులు ఏవీ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్ సిటీ ఉన్నది ఈ ప్రావిన్స్‌లోనే వుహాన్ సిటీ సహా ఈ ప్రావిన్స్‌లోని దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లో కరోనా వైరస్‌ చుట్టబెట్టింది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వారి సంఖ్య కూడా ఈ ప్రావిన్స్‌లోనే అధికంగా నమోదైంది

అమెరికాలో వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్‌లల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసు నమోదు కాగా.. కాలిఫోర్నియాలో ఇద్దరిలో ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు. ఫలితంగా- అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ను నియంత్రించడానికి

 

Leave a Reply