*వచ్చే నాలుగు వారాలు కోవిడ్ మరింత తీవ్రతరం*

Share Icons:

హైదరాబాద్ : రాష్ట్రంలో కొరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే కొంతమేర కుదుటపడు తున్నాయనీ, ప్రజలు వచ్చే నాలుగు వారాలు అంత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాంణ  ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.జి.శ్రీనివాసరావు అన్నారు. కొరోనా వైరస్‌ సోకిన వారిలో 85 శాతం మంది ఆస్పత్రిలో  చేరాల్సిన అవసరం లేదని ఇంట్లోనే మందులు వాడి  తగ్గించుకోవాలన్నారు. బుధవారం కోఠిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ,. కొరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కూడా సహకరిస్తున్నారనీ, పెళ్లిళ్లు, పండగల సీజన్‌లో సైతం ఇదే విధంగా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

కొరోనా లక్షణాలు ఉన్న వారు మాత్రమే హాస్పిటల్స్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలనీ, లక్షణాలు ఉన్నా  ఇంట్లోనే ఉండి మందులు వాడటం ద్వారా కొరోనా నుంచి బయట పడవచ్చన్నారు. కోవిడ్‌ టెస్టింగ్‌ కేంద్రాలలో ప్రజలు గుంపుగూడ కూడదని, , అవసరమైతే తప్ప హాస్పిటల్స్‌కు రావొద్దని కోరారు. ఆక్సీజన్‌, ఔషధాలు, పడకల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మెరుగైన స్థితిలో ఉందన్నారు. ఏడాదిన్నరగా ప్రజారోగ్య సిబ్బంది అలుపెరుగని పోరాటం చేస్తున్నారనీ, ఇప్పటి వరకు మొత్తం 45 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామనీ, టీకా వేసుకున్న వారిలో ఎవరూ తీవ్రమైన అస్వస్థతకు గురి కాలేదన్నారు. టీకా వేసుకున్న వారిలో 80 శాతం మందికి కోవిడ్‌ సోకలేదనీ, మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారంతా తప్పనిసరిగా టీకా వేయించుకోవాలనీ విజ్ఞప్తి చేశారు.

(న్యూస్ ప్రతినిధి)

Leave a Reply