చైనాలో భారీగా కరోనా బాధితులు…చైనా పత్రిక సంచలనం..

More than 2,700 cases of coronavirus in China as death toll climbs to 80
Share Icons:

బీజింగ్: గత కొన్నిరోజులుగా కరోనా వైరస్ దెబ్బకు చైనాని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ భారీన పడి వందలమంది ప్రాణాలు కోల్పోయారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే చైనాలోని ప్రధాన నగరాల రహదారులన్నీ కర్ఫ్యూ విధించినట్టుగా ఖాళీగా ఉంటున్నాయి. జనాలెవరూ తమ ఇళ్ల నుంచి బయటకు కూడా రావడం లేదు. వైరస్ కారణంగా 564 మంది చనిపోయారని చైనా అధికారికంగా ప్రకటించింది.

కానీ, చెనాలో అతి పెద్ద ఆన్ లైన్ న్యూస్ వెబ్ సైట్ ‘టెన్సెంట్’ భయంకర నిజాన్ని వెల్లడించింది. చైనాలో కరోనా వైరస్ 1,54,023 మందికి సోకిందని… వీరిలో 24,589 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో, చైనాలో తీవ్ర కలకలం రేగింది. ఆ తర్వాత ఆ వెబ్ సైట్ తన గణాంకాలను మార్చింది. 14,4456 మంది వైరస్ బారిన పడ్డారని, వీరిలో 304 మంది చనిపోయారని తెలిపింది. టెన్సెంట్ తన గణాంకాలను మార్చినా ప్రజల్లో ఆందోళన తగ్గలేదు. టెన్సెంట్ కచ్చితమైన వివరాలనే వెల్లడించిందని… ప్రభుత్వ హెచ్చరికలతో గణాంకాలను మార్చిందని పలువురు ఆరోపిస్తున్నారు.

వూహాన్ నుంచి ఈ వైరస్ దేశంలోని నలుమూలలకు వ్యాపించింది. చైనాలో పరిస్థితి అదుపులో లేదని… వాస్తవాలను ప్రభుత్వం దాస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే కేరళలో భారీ ఎత్తున కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇదే రాష్ట్రంలో మూడు కరోనా కేసులు ఇదివరకే పాజిటివ్‌గా తేలాయి. తాజాగా- 2826 అనుమానిత కేసులు నమోదు కావడం కేరళ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అనుమానితులందరినీ వేర్వేరు ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జనవరి 15వ తేదీ తరువాత చైనా నుంచి స్వరాష్ట్రానికి వచ్చిన వారికి తాము వరుసగా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని కేరళ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు.

ఇందులో 2,743 మందిని ప్రత్యేక శిబిరాల్లో ఉంచి వైద్య పరీక్షలను చేస్తున్నామని చెప్పారు. మరి కొందరికి 83 ఆసుపత్రుల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. దశలవారీగా వారి రక్త నమూనాలను పుణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపిస్తున్నామని అన్నారు. ఇప్పటిదాకా మొత్తం 263 రక్త నమూనాలను పంపించామని, గురువారం నాటికి 229 నమూనాలు నెగిటివ్‌గా తేలాయని వివరించారు. ఇప్పటిదాకా మూడు కేసులు మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారించినట్లు చెప్పారు. వారికి ప్రత్యేక చికిత్సను అందిస్తున్నామని శైలజ చెప్పారు.

 

Leave a Reply