ఆగని కరోనా మరణాలు…ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే?

Coronavirus update: 170 killed, evacuations begin, While House may ban all US-China flights
Share Icons:

బీజింగ్: చైనాలో కరోనా కల్లోలం ఆగలేదు. రోజురోజుకు దాని ప్రభావం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. చైనాలో కరోనా మృతుల సంఖ్య 717కి చేరింది. రోజూ దాదాపు 50 నుంచీ 70 మంది దాకా చనిపోతున్నారు. అలాగే కొత్తగా రెండు మూడు వేల కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం చైనా సహా… దాదాపు 30 దేశాల్లో 31 వేల మంది కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నారు.

అయితే డాక్టర్లు కరోనా వైరస్ అంతుచిక్కని బ్రహ్మపదార్థంలా మారిందంటున్నారు. అసలు దీని స్వరూపాన్ని కనుక్కోవడానికే చాలా టైమ్ పట్టింది. ఇది ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా విస్తరిస్తుందో తెలుసుకోవడానికి మరికొన్ని రోజులు పట్టింది. ఇప్పుడు ఈ వైరస్‌ని ఎలా అంతమొందించాలో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. చైనాలో పెద్ద ఎత్తున వైరస్ విరుగుడు కోసం మందుల పరీక్షలు సాగుతున్నాయి. ఏయే మందులు మిక్స్ చేసి ప్రయోగించినా ఈ వైరస్ చనిపోవట్లేదు.

ఇక మన తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్లకు కూడా ఈ వైరస్ కొత్తదే. అందువల్ల గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లు బ్లడ్ శాంపిల్స్ సేకరించడం, వాటిని పరీక్షించడం వంటి విషయాల్లో కాస్త ఆందోళన చెందుతున్నారు. అత్యంత సున్నితమైన అంశం కావడంతో… అనుమానితులకు వచ్చింది మామూలు జ్వరమా లేక కరోనా వైరస్సా అన్నదానిపై కన్‌ఫ్యూజ్ అవుతున్నారు.

కరోనా వైరస్‌ దృష్ట్యా… హైదరాబాద్… శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రోజూ దాదాపు 800 మందికిపైగా ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు జరుగుతున్నాయి. ఎక్కువగా హాంకాంగ్, మలేసియా, సింగపూర్, థాయిలాండ్ నుంచి వస్తున్న ప్రయాణికులకు థెర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం చైనా నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి డైరెక్టుగా విమానాల రాకపోకలు లేవు. ఆపేశారు. హాంగ్‌కాంగ్‌ మాత్రం రోజూ ఒక విమానాన్ని అటూ ఇటూ నడుపుతోంది. మొత్తానికైతే మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా అనుమానితులు ఉన్నారు తప్ప, బాధితులు లేరు.

 

Leave a Reply