భారత్‌లో మూడో కరోనా మరణం…మహారాష్ట్రలో వృద్ధుడు మృతి….

Coronavirus update: 170 killed, evacuations begin, While House may ban all US-China flights
Share Icons:

ముంబై: కరోనాతో భారత్‌లో మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో మనదేశంలో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్రలో కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్న పేషెంట్ చనిపోయాడు. చికిత్స పొందుతూ మహరాష్ట్రకు చెందిన 64 ఏళ్ల వృద్దుడు చనిపోయాడు. దీంతో కరోనా వైరస్ పట్ల ఆందోళన మరింత ఎక్కువవుతోంది. భారత్‌లో తొలి కరోనా మృతి తెలంగాణలోని హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. కర్నాటకకు చెందిన వృద్ధుడు గాంధీ ఆస్పత్రిలో కరోనా వ్యాధితో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ఆ తర్వాత ఢిల్లీలో రెండో కరోనా మరణం సంభవించింది. అక్కడ చికిత్స పొందుతూ… 69 ఏళ్ల మహిళ కరోనా వ్యాధితో చనిపోయింది. తాజాగా మూడో మరణం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబై కస్తూర్బ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 64 ఏళ్ల వృద్ధుడు ఇవాళ చనిపోయాడు. కరోనా వ్యాధి బారిన పడి చనిపోయిన వారంతా వృద్ధులే కావడం విశేషం.

ఇదిలా ఉంటే మరోవైపు కరోనా వ్యాప్తికి కేంద్రం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. విదేశాల నుంచి వస్తున్న వారిపై నిఘా పెట్టింది. ముఖ్యంగా కరోనా ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వస్తున్న వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారిలో ఏ మాత్రం కరోనా లక్షణాలు కనిపించినా ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందుతున్నారు. దేశ వ్యాప్తంగా కూడా కేంద్రం పటిష్టమైన చర్యలు చేపట్టింది. కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాల్స్, పార్కులు, పబ్లిక్ స్థలాలు అన్నింటిని మూసివేశారు. ప్రజలు ఎవరూ రద్దీ ప్రాంతాలకు వెళ్లకూడదని కోరుతున్నారు.

మహారాష్ట్రలో ఇప్పటికే 38 కేసులు నమోదైన విషయం తెలిసిందే. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైంది కూడా ఇక్కడే. బాధితుడి మృతితో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అధికారులు అప్రమత్తం చేశారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కాగా దేశంలో సోమవారానికి ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య  114కు చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలపగా.. ఆ సంఖ్య మంగళవారం నాటికి 126కి చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకుంది.

 

Leave a Reply