“కరోనా  చైనాకు తెలియదు… అది జీవాయుధం కాదు” -అన్ని సిద్ధాంతాలను కొట్టిపారేసిన అమెరికా!

Share Icons:
  • బైడెన్ ఆదేశాలతో సిద్ధం చేసిన డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్  
  •  మూలాలు కనుక్కొని తీరుతామన్న బైడెన్

జీవాయుధం కోసం కరోనాను ల్యాబ్ లో చైనా పుట్టించిందని ఒకసారి… కావాలనే ల్యాబ్ నుంచి లీక్ చేశారని ఇంకోసారి… ప్రమాదవశాత్తూ లీక్ అయిందని మరోసారి… ఇలా ఇప్పటిదాకా ఎన్నెన్నో సిద్ధాంతాలను అమెరికా చెబుతూ వస్తోంది. ఇప్పుడు మాట మార్చి.,. అసలు అది జీవాయుధమే కాదు అని అంటోంది. అన్ని సిద్ధాంతాలను కొట్టిపారేస్తూ తాజా నివేదికను విడుదల చేసింది. కరోనా వైరస్ పుట్టుక గురించి వివిధ నిఘా సంస్థలు ఇచ్చిన నివేదికలపై సమగ్ర విశ్లేషణ జరిపి నివేదిక ఇవ్వాలన్న అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతో డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్… ఆ నివేదికను సిద్ధం చేసింది.

వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీకై మహమ్మారిలా విస్తరించి ఉండొచ్చని నివేదికలో పేర్కొంది. కరోనా జన్యుపరంగా సృష్టించిన వైరస్ కాదని స్పష్టం చేసింది. నిఘా సంస్థలు చెబుతున్న సిద్ధాంతాలను నిరూపించే ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపింది. కరోనా మహమ్మారికి ముందు ఆ వైరస్ గురించి తెలిసి ఉండకపోవచ్చని పేర్కొంది., ఈ నివేదికను చైనా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉంటాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply