వంటింటి వైద్యo  కొత్తిమీరతో ఆరోగ్యం :

Share Icons:

వంటింటి వైద్యo  కొత్తిమీరతో ఆరోగ్యం :

కొత్తిమీర. వంటింటి వైద్యానికి పేరుపొందినది. ఎక్కడపట్టినా దొరుకుతుంది. చౌక కూడా. ఇది సర్వకాల  సర్వావస్థల్లోనూ మనకు అందుబాటులో ఉండే ఆకుకూర పదార్ధం. కొత్తిమీర ఆహర పదార్థాల మీద అలంకరించుకోవడానికే కాదు. మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు, కాయకూరల వంటకాల్లో  విరివిగా వేసి తీసుకోవచ్చు. కొత్తిమీర నిండా విటమిన్లు. ఖనిజ లవణాలున్నాయి. అంతేకాదు సమృద్ధిగా ఐరన్ కూడా లభిస్తుది. రక్తహీనతను తగ్గిస్తుంది. పొగతాగడం, అలాగే కిమోథెరఫీ (రసాయనాలతో చికిత్స చేయడం) వల్ల కలిగిన నష్టం తగ్గించడానికి ఇది పోరాడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గించడంలో, రక్త నాళాల్లో ఆటంకాలను తొలగించడంలోనూ కొత్తిమీర ఉపయోగపడుతుంది. తాజా కొత్తిమీరలో లభించే ‘బోర్నియోల్’ అనే పదార్ధం జీర్ణశక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. ఆగకుండా విరేచనాలు అవుతున్నప్పుడు కొత్తిమీర రసం తాగితే సమస్య దారికొస్తుంది. కాలేయం పనితీరును మెరుగు పరచటంలో కొత్తిమీర బాగా పనిచేస్తుంది. సౌందర్య పోషణకు వాడే క్రీములు, లోషన్ల తయారీలో కొత్తిమీరను వాడుతారు. మొటిమలు, పొడి చర్మం, నల్ల మచ్చలను కొత్తిమీర తగ్గిస్తుంది. రోజూ కొత్తిమీర తినేవారికి రక్తపోటు పూర్తిగా అదుపులో ఉంటుంది.

కొత్తిమీర ఆకులను నీటిలో వేసి మరిగించి, తర్వాత ఆ ఆకులను నీటిలోనే 2 గంటలపాటు మూతపెట్టి వదిలేయాలి. తర్వాత నీటిని వడగట్టి ఒక గ్లాసులోకి తీసుకోవాలి. ఈ నీటిని ప్రతిరోజూ ఉదయం అల్పాహారం ముందు తాగాలి.  కొత్తిమీరలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని కూడా సమతుల్యం చేస్తుంది. దీనివల్ల డయాబెటిస్ లక్షణాలు అదుపులో ఉంటాయి.

కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన కీళ్ళకు, కార్టిలేజెస్ కు రక్తం సరఫరా అయ్యేట్టు చూసి కీళ్లవాతాన్ని సహజంగా నయం చేస్తుంది. కీళ్ళ నొప్పులను మాయం చేస్తుంది. ఇది సహజంగా డైయూరిటిక్ కావటం వలన ఇది కిడ్నీలోంచి అనవసర వ్యర్థాలను బయటకి తరిమివేసి మరియు కిడ్నీలో రాళ్ళను సహజంగా తగ్గిస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు మరియు పొటాషియం ఎక్కువగా ఉండి శరీరంలో ప్రతి కణాన్ని బలంగా మారుస్తాయి. అలా అన్ని వ్యాధులతో పోరాడే శక్తి పెరిగి మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా,శరీరం ఆరోగ్యంగా మారుతుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు కొన్ని సాధారణ రకాల క్యాన్సర్లను, కాన్సర్ కారకమైన కణాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకుని నివారిస్తాయి.

కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువ. మెగ్నిషియం, ఇనుము, మాంగనీస్‌లు తగిన మోతాదులో లభిస్తాయి. విటమిన్ సి, కెతోపాటు ప్రోటీన్లూ ఎక్కువే. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో హాని చేసే కొవ్వు తగ్గుతుంది. పెదవులు నల్లగా ఉన్నవారు రోజూ రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసం పెదవులపై రాయండి. కొన్ని రోజులకి పెదాలు లేత రంగును సంతరించుకొంటాయి. కాలేయం పనితీరును మెరుగు పరచటంలో కొత్తిమీర బాగా పనిచేస్తుంది. మొటిమలు, పొడి చర్మం, నల్ల మచ్చలను తగ్గిస్తుంది.

కొత్తిమీరలోని యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గాయాలను మాన్పటానికి, నోటి పొక్కులను తగ్గిస్తాయి. నొప్పితో కూడిన వాపులు కొత్తిమీర ఆకులను, బాదం పలుకులతో ముద్దగా నూరి వాపు, నొప్పి ఉన్నచోట పట్టుగా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. రోజూ కొత్తిమీర తినేవారికి రక్తపోటు పూర్తిగా అదుపులో ఉంటుంది. కొత్తిమీరలో పుష్కలంగా ఐరన్ లభిస్తుంది. ఇది రక్తశుద్ధికి, రక్త వృద్ధికి దోహదపడి రక్తహీనతను దరిజేరనీయదు. కొత్తిమీర రసంలో విటమిన్-ఎ, బి1, బి2, సి, ఐరన్ ఉంటాయి.

తలతిరగడం, వేవిళ్లు, చర్మవ్యాధులను నయం చేసే గుణం కొత్తిమీరలో పుష్కలంగా వుంది. ఎముకలకు బలం చేకూరాలంటే కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవాలి. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. వాత రోగాలను నయం చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. కొత్తిమీర టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. కొత్తిమీర, ఉసిరికాయ వడియాలు తీసుకుని ఓ పాత్రలో రెండు గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని వడగట్టి బెల్లం చేర్చి తీసుకుంటే.. వ్యాధులు తొలగిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

బరువు తగ్గాలంటే.. కొత్తిమీర, నిమ్మరసం, తేనెతో సూపర్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఓ పాత్రలో కొత్తిమీర ఆకులు 50 మి.గ్రాములు తీసుకుని నీరు చేర్చి మరిగించాలి. ఇందులో నిమ్మరసం రెండు స్పూన్లు చేర్చండి. ఇది మరిగాక వడగట్టి ఒక స్పూన్ తేనె చేర్చి.. ఒక వారం పాటు పరగడుపున తీసుకుంటే బరువు తగ్గుతారు. కిడ్నీలో రాళ్లను తొలగించుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను ఇది వెలివేస్తుంది. కొత్తిమీర జ్యూస్ తాగితే జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. దంత సమస్యలకు కొత్తిమీర మెరుగ్గా పనిచేస్తుంది. చిగుళ్ల వాపుకు కొత్తిమీర చెక్ పెడుతుందని అంటారు.

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply