క‌న్జ్యూమ‌ర్ ప్రొటెక్ష‌న్ బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం..

Share Icons:

న్యూఢిల్లీ, 20 డిసెంబర్:

స్టాండింగ్ క‌మిటీ అనుమ‌తి దక్కించుకున్న క‌న్జ్యూమ‌ర్ ప్రొటెక్ష‌న్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ ఈరోజు ప్ర‌వేశ‌పెట్టగా, దానికి లోక్‌స‌భ‌ కొన్ని సవరణలతో ఆమోద ముద్ర వేసింది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఈ-మెయిల్ ద్వారా కూడా వినియోగ‌దారుడు త‌న ఫిర్యాదును న‌మోదు చేయ‌వ‌చ్చని, అలాగే త‌న కేసును విచారించేందుకు వినియోగ‌దారుడు లాయ‌ర్‌ను ఆశ్ర‌యించాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

ఇక కృత్రిమ ఉత్ప‌త్తుల‌కు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేసే సెల‌బ్రిటీల‌కు శిక్ష ఉండ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అలాగే వినియోగ‌దారుల ర‌క్ష‌ణ బిల్లు వ‌ల్ల ఫిర్యాదు న‌మోదు చేసే ప్ర‌క్రియ సులువుగా మారింద‌ని, అయితే వాణిజ్య ఉత్ప‌త్తుల‌ను సెల‌బ్రిటీలు ప్ర‌మోట్ చేయ‌డం ప‌ట్ల స‌రైన వివ‌ర‌ణ ఇవ్వాల‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ ప్ర‌తిమా మోండ‌ల్ కోరారు.

త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌ల‌తో సెల‌బ్రిటీలు త‌ప్పించుకుంటున్నార‌ని ఆమె ఆరోపించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ఉత్ప‌త్తిని అమ్మేవారు, వాణిజ్య ప్ర‌క‌ట‌న చేసేవారు, దాన్ని ఎండార్స్ చేసేవారు బాధ్యులుగా ఉంటార‌ని మంత్రి తెలిపారు. క్వాసీ జుడిషియ‌ల్ ప‌ద్ద‌తిలో విచార‌ణ‌ జ‌రుగుతుంద‌ని మంత్రి తెలిపారు. కొంద‌రు స‌భ్యులు కోరిన స‌వ‌ర‌ణ‌ల‌కు మంత్రి ఓకే చెప్పారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ఓటింగ్‌లో బిల్లుకు ఆమోదం ద‌క్కింది.

మామాట: వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే అంశమే…

Leave a Reply