ఆ విషయంలో తెలంగాణ తొలిస్థానంలో ఉంది…

Share Icons:

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఎన్నికలు ఉంటేనే పథకాలు అమలవుతాయని… లేకపోతే అన్నీ అటకెక్కినట్టే అని, దేశంలో రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్న నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ లెక్కలను ఆయన ప్రస్తావించారు. జనాభా ప్రకారం చూసుకుంటే… ఈ విషయంలో తెలంగాణ తొలిస్థానంలో ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కలెక్టర్ల సమావేశంలో 12 గంటల ఉపన్యాసం ఇచ్చిన సీఎం కేసీఆర్… కనీసం ఐదు నిమిషాలైనా రైతుల సమస్యలపై చర్చించలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతు సమన్వయ సమితిలు ఫెయిలయ్యాయని ధ్వజమెత్తారు. గడిచిన ఆరు నెలల్లో తెలంగాణలో 5,912 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటేనే… పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కేసీఆర్ ఎంతో గొప్పగా చెప్పే రైతు సమన్వయ సమితిలు టీఆర్ఎస్ నేతలకు పునరావాస కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేలా… బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

Leave a Reply