రాహులే మళ్ళీ అధ్యక్షుడు కావాలి… సీడబ్ల్యూసీ ఏకవాక్య తీర్మానం

congress working committee decide to rahul gandhi is president again
Share Icons:

ఢిల్లీ:

 

ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో సమర్ధుడైన మరోనేతని నియమించాలని సూచించారు. అయితే కాంగ్రెస్ పెద్దలు మాత్రం రాహుల్ నే అధ్యక్ష పదవిలో ఉండాలని కోరగా….దానికి రాహుల్ నో చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునేందుకు సమావేశమైన వర్కింగ్ కమిటీ ఏమీ తేల్చలేకపోయింది. ముకుల్ వాస్నిక్, మల్లికార్జున ఖర్గే వంటి నేతల పేర్లు కొత్త అధ్యక్షుడి రేసులో బలంగా వినిపించినా, వర్కింగ్ కమిటీ సభ్యులందరూ రాహుల్ గాంధీ వైపే మొగ్గుచూపారు.

 

ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని మించి సమర్థుడు మరొకరు లేరని, మత తత్వ పార్టీలు దేశాన్ని ముక్కలు చెక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని నడిపించడంతో పాటు దేశాన్ని రక్షించగల సత్తా ఒక్క రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. అందుకే, రాహులే మళ్లీ రావాలంటూ సీడబ్ల్యూసీ ఏకవాక్య తీర్మానం చేసింది.

 

అయితే, తమ నిర్ణయంపై రాహుల్ ఏమంటాడోనన్న అంతర్మధనంలో ఉన్న కాంగ్రెస్ నేతలు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.ఈ కార్యక్రమానికి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. కాగా, కొత్త చీఫ్ ను ఎన్నుకునే క్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 5 ఉప కమిటీలుగా విడిపోయింది. ఈ కమిటీల్లో తమ పేర్లను చేర్చడం పట్ల సోనియా, రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధ్యక్షుడి ఎన్నికపై తమ ప్రభావం పడే ఎలాంటి చర్యకు తాము సమ్మతం కాదని ఇరువురు స్పష్టం చేయడమే కాకుండా, సమావేశం నుంచి నిష్క్రమించారు.

 

Leave a Reply