ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడుతున్న కాంగ్రెస్ సీనియర్లు..

Share Icons:

హైదరాబాద్, 26 ఫిబ్రవరి:

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికల జరగనున్నాయి. ఈ ఐదు స్థానాల్లో టీఆర్ఎస్ నాలుగు తీసుకుని, మిత్రపక్షం ఎం‌ఐ‌ఎం కి ఒక స్థానాన్ని కేటాయించింది. అయితే ఐదు స్థానాలు గెలుచుకోడానికి టీఆర్ఎస్‌కి సంఖ్య బలం లేదు. దీంతో ఒక స్థానానికి కాంగ్రెస్ కూడా తమ అభ్యర్ధిని నిలబెడుతుంది. ఇక ఐదో స్థానానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ అనివార్యం అయింది.

అయితే ఈ ఒక్క స్థానానికి కాంగ్రెస్ సీనియర్లు పోటీ పడుతున్నారు. షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి నేతలు తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ అధిష్టానం తనకు అవకాశం ఇస్తుందని భావిస్తున్న మర్రి శశిధర్ రెడ్డి… ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు కోసం అమరావతి వెళ్లి చంద్రబాబును కూడా కలిసొచ్చారు. వీరిలో పాటు మరో ఇద్దరు నేతలు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక తమకు కావాల్సిన బలం లేకపోయినా టీఆర్ఎస్ ఐదో అభ్యర్ధిని బరిలో ఉంచడంతో… వారికి పోటీగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆర్థికంగా బలమైన అభ్యర్థి పోటీలో ఉంటేనే… అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వొచ్చని కాంగ్రెస్ యోచిస్తోంది.

మామాట: మరి ఆ ఒక్క సీటు ఎవరికి దక్కుతుందో

Leave a Reply