పెట్రో ధరపై కాంగ్రెస్ రాష్ట్రవ్యాపిత నిరసన …

Share Icons:
  • నిర్మల్ లో రేవంత్, ఖమ్మం లో భట్టి
  • పెద్ద ఎత్తున‌ ధ‌ర్నా.. ఎడ్లబండ్ల‌పై నిరసన ర్యాలీలు
  • ప‌లువురు నేత‌ల అరెస్టు…విడుదల. ఇందిరా పార్క్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌
  • ప్రదర్శనలో అపశ్రుతి… మెదక్ లో ఎడ్లబండి నుంచి కిందపడిన రాజనర్సింహ

పెరుగుతున్న పెట్రో ,డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. కొత్త పీసీసీ వచ్చిన తరువాత జరిగిన మొదటి ఆందోళన కావడంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్మల్ లో పాల్గొనగా , ఖమ్మం లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

హైద్రాబాద్ లో పొన్నాల ,అంజాన్ కుమార్ యాదవ్

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిర‌స‌న తెల‌ప‌డానికి పీసీసీ కొత్త‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఎడ్లబండి మీద వచ్చారు. అయితే, ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి యత్నించడంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ సందర్భంగా పలువురు ఆందోళ‌న‌కారుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఇందిరా పార్క్‌, ధర్నా చౌక్‌ వద్దకు వచ్చిన మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీత రావు, ఇతర మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరోపక్క, మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల ల‌క్ష్మ‌య్య‌తో పాటు రాములు నాయ‌క్, ఫిరోజ్ ఖాన్ ఇత‌ర కాంగ్రెస్ నేత‌లు కూడా హైద‌రాబాద్‌లో మరోచోట నిర‌స‌న‌లో పాల్గొన్నారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. నిర్మ‌ల్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఏలేటి మహేశ్వర్ రెడ్డితో క‌లిసి పాద‌యాత్ర చేస్తున్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లోనూ పెట్రోల్ ధ‌ర‌ల పెంపున‌కు నిర‌స‌న‌గా కాంగ్రెస్ ఆందోళ‌న‌కు దిగింది. ఎడ్ల‌బండ్ల‌తో పాటు సైకిళ్లతో కాంగ్రెస్ నేత‌లు ర్యాలీ నిర్వ‌హించారు.

మెదక్ నిరసనలో అపశృతి ఎడ్ల బండిపై నుంచి కిందపడిన రాజనరసింహ …

మెదక్ లో  ధర్నాచౌక్ లో నిర్వహించిన  కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత గీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమoల్లో. ఓ ఎడ్లబండి పైనుంచి రాజనర్సింహ ప్రసంగిస్తుండగా ఎడ్లు ఒక్కసారిగా బెదరడంతో బండి కుదుపులకు గురై, బండిపై ఉన్న రాజనర్సింహ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మోకాలికి దెబ్బతగలడంతో వైద్యులు చికిత్స అందించారు.

ఖమ్మం నిరసనలో ఎడ్ల బండిపై భట్టి ….

ఖమ్మం లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవరెడ్డి భవనం నుండి ధర్నా చౌక్ వరకు  డిజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలకు నిరసనగా సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో యడ్ల బండి పై ప్రదర్శన, సైకిల్ ర్యాలీ  సందర్భంగా బట్టి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజానీకాన్ని నడ్డి విరిసేలా, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెంచిందని ,దీనివల్ల మార్కెట్ లోని అన్ని ఉత్పత్తులపై ప్రభావం పడి ఇతర వస్తువుల రేట్లు కూడా పెరుగుతాయని, రానున్న ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది అన్నారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

 

Leave a Reply