వాడిన కమలం- రాహుల్‌ ఆనందమయం

Share Icons:

జైపూర్, 01 ఫిబ్రవరి:

జనవరి 29న రాజస్థాన్‌లోని మందల్ గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు, అజ్మీర్, అల్మార్ పార్లమెంటరీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి.

ఉపఎన్నిక జరిగిన మూడు స్థానాలలోనూ బి‌జే‌పి చిత్తు చిత్తుగా ఓడిపోయింది. అదే స్థానాలలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు కరణ్‌సింగ్ యాదవ్, రఘుశర్మ ఎంపీలుగా, వివేక్‌ధాకర్ ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో విజయం సాధించారు.

మూడు చోట్లా తమ అభ్యర్ధులు ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, ‘వెల్‌డన్ రాజస్థాన్ కాంగ్రెస్! ప్రతిఒక్కరినీ చూసి గర్వపడుతున్నా. బీజేపీని రాజస్థాన్ ప్రజలు తిరస్కరించారనడానికి ఈ విజయం అద్దం పడుతోంది’ అని సంతోషం వ్యక్తం చేశారు.

రాజస్థాన్‌లో బీజేపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ నేత కైలాశ్ విజయ్ వార్గియా స్పందిస్తూ, ఈ ఉపఎన్నికలో తమ పార్టీ పరాజయానికి గల కారణాలను తెలుసుకుంటామని, కేవలం, ఈ ఫలితాలను ఆధారంగా చేసుకుని ఏవేవో ఊహించుకోకూడదని అన్నారు.

గతంలో జరిగిన గుజరాత్ ఎన్నికల ఫలితాలలో కూడా బి‌జే‌పిపై వ్యతిరేకత బయటపడడం, ఇప్పుడు మరింత చిత్తుగా ఓడిపోవడంతో ఈ ఫలితాలు బీజే‌పీ నేతలకు మింగుడు పడడం లేదు.

మామాట: రాబోవు ఎన్నికలపై బీజేపీకి ఇవి సంకేతాలా?

English summary: Mandalgarh Assembly constituency in Rajasthan and Ajmer and Alam Parliamentary constituencies election results were announced. All the three places The BJP loses its alliance and Congress overwhelmed by the victory.

Leave a Reply