స్వంత పార్టీ పై సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చురకలు …

Share Icons:
  • పార్టీ నాయకత్వాన్ని క్రమబద్ధీకరించాల్సి ఉంది. 
  • సొంత పార్టీపై జైరాం కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ అధిష్టానంపై సీనియర్ నేతలు గళం విప్పుతున్నారు…. పార్టీ ప్రక్షాళన జరగాలని , క్రమబద్దీకరించాలని అంటున్నారు…. గతంలో 23 సీనియర్ నేతల పార్టీ అధ్యక్షురాలికి పార్టీలో సంస్థగా ఎన్నికలపై లేఖ రాశారు. అది పెద్ద దుమారంలో లేపింది. లేఖ రాసిన వారిలో జితిన్ ప్రసాద బీజేపీ తీర్థం పుచుకున్నారు…..జ్యోతిరాదిత్య సింధియా లాంటి పుట్టుకతో కాంగ్రెస్ వాదులు సైతం కాషాయం వైపు పరుగులు తీశారు. మరికొంత మంది అదే బాటలో ఉన్నారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో పార్టీ క్రమబద్దీకరణపై పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రత్తిలో మరో మరు చర్చకు దారితీశాయి.

సొంత పార్టీ తీరుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వాన్ని క్రమబద్ధీకరించాల్సి ఉందన్నారు. అలాగే పార్టీ ఉనికిని మరింత విస్తృతం చేయాలన్నారు. 2014, 2019 ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చవిచూసిందన్నారు. ఇప్పటికైనా పార్టీని ఓ క్రమంలో పెట్టాలని హితవు పలికారు. అలాగే ప్రజల్లోకి పంపే సందేశం సైతం ఓ క్రమ పద్ధతిలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో ఏ ఒక్క నాయకుడి వద్దనో మంత్రదండం ఉండదని.. అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్‌ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల పార్టీ వీడినవారి గురించి మాట్లాడుతూ.. పార్టీని వదిలివెళ్లిన యువ నాయకులు పుట్టుకతోనే ప్రత్యేక అవకాశాల్ని పుణికిపుచ్చుకున్నారన్నారు. పార్టీలో వారికి సముచిత స్థానం దక్కిందన్నారు. పార్టీని వీడిన ప్రతి ‘సింధియా’ స్థానంలో పార్టీ కోసం పోరాడే వేలాది మంది కార్యకర్తలు ఉన్నారని వ్యాఖ్యానించారు. జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. వీరిపై ఒకప్పుడు బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిందని.. ఇప్పుడు అదే పార్టీ వారిని చేర్చుకుంటోందన్నారు. తమ పార్టీకి ఒక క్రమశిక్షణ ఉందని.. ఇష్టం వచ్చినట్లు వెళ్లి రావడం కుదరదని పేర్కొన్నారు.

ఇక కాంగ్రెస్‌ని వీడుతారంటూ ఊహాగానాలు వస్తున్న మరో నాయకుడు సచిన్‌ పైలట్‌పై జైరాం ప్రశంసలు కురిపించారు. పైలట్‌ పార్టీకి గొప్ప ఆస్తి అని.. అతనికి పార్టీలో గొప్ప భవిష్యత్తు ఉంటుందన్నారు. గత ఏడాది సచిన్‌ పైలట్‌ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. చివరకు అధిష్ఠానం ఆయన డిమాండ్లకు ఒప్పుకోవడంతో వెనక్కి తగ్గారు. కానీ, ఇప్పటి వరకు ఆ డిమాండ్లను నెరవేర్చలేదని.. ఈ విషయంపై ఇటీవలే ఆయన ఢిల్లీ వెళ్లారని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో జైరాం ఆయనపై ప్రశంసలు కురిపించడం గమనార్హం.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply